పుష్ప2 సినిమా రిలీజ్ అయిన తర్వాత అల్లు అర్జున్ సంధ్య థియేటర్లో సినిమా చూడడానికి ఫ్యామిలీతో కలిసి అక్కడికి వచ్చారు . అక్కడ అల్లు అర్జున్ ని చూడగానే జనాలు ఎగబడి పోయారు . ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది . ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది . అల్లు అర్జున్ ని పోలీసులు అక్కడికి రావద్దు అంటూ హెచ్చరించినా కూడా అక్కడికి వచ్చారు అని .. ఆయన నిర్లక్ష్యం కారణంగానే ఒక నిండు ప్రాణం బలైపోయింది అంటూ పోలీస్ కేసు నమోదవడం ..తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడం ..నాంపల్లి కోర్టు 14 రోజులకు రిమాండ్ విధించడం.. ఆ తర్వాత హైకోర్టు మధ్యాంతర బెయిల్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి.
దీంతో అల్లు అర్జున్ సేఫ్ గా బయటికి వచ్చినట్లైంది. కానీ అల్లు అర్జున్ అరెస్ట్ అరెస్ట్ విషయం మాత్రం ఇంకా పాన్ ఇండియా స్థాయిలో వినిపిస్తూనే ఉంది. తెలంగాణ పోలీసులు మళ్ళీ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడానికి ఆయన బెయిల్ రద్దు చేయాలి అంటూ రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. కాకపోతే ఈ మూమెంట్లో అల్లు అర్జున్ కి సంబంధించిన కొన్ని వార్తలు కూడా బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారాయి . అల్లు అర్జున్ ఒకప్పుడు టీవీ చూసేటప్పుడు ఏ న్యూస్ వచ్చిన ఇంట్రెస్ట్ గా చూసేవారట. కానీ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత జైలుకు సంబంధించిన పిక్చర్స్ కనపడిన జైలుకు సంబంధించిన వార్తలు వచ్చిన వెంటనే ఛానల్ ను మార్చేస్తున్నారట. అసలు ఆ పేరు కూడా ఇంట్లో వినిపిస్తే చిరాకు పడిపోతున్నాడట . పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ కి ఎలాంటి పరిస్థితి దాపురించిందో అంటూ జనాలు బాధ పడిపోతున్నారు..!?