టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ గేమ్ ఛేంజర్ ’ కోసం అభిమానులు ఎంత ఆసక్తి గా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ దర్శకుడు శంకర్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ? సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని ఉత్కంఠ ఉంది. ఎందుకంటే శంకర్ గత కొంత కాలంగా ఫామ్ లో లేడు. శంకర్ రేంజ్‌కు తగ్గ హిట్ రోబో మాత్రమే. ఆ తర్వాత శంకర్ ఎన్ని సినిమాలు చేసినా కూడా వరుస పెట్టి డిజాస్టర్లే అవుతున్నాయి. మరీ ముఖ్యంగా కమల్ హాసన్ తో తీసిన భారతీయుడు 2 సినిమా అయితే అసలు శంకర్ డైరెక్షన్ చేస్తున్నాడా ? పూర్తిగా అవుట్ డేటెడ్ అయిపోయాడా ? మర్చిపోయాడా ? అన్న సందేహాలు ప్రతి ఒక్కరి లోనూ కలిగేలా ఆ సినిమా అవుట్ ఫుట్ వచ్చింది.
ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమా పై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇక ఈ సినిమా ను సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు. ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ మూవీకి ప్రీమియర్ షోస్ ఉంటాయా లేదా.. అనేది మెగా ఫ్యాన్స్‌లో కాస్త ఓ డౌట్ అయితే నెలకొన్న మాట వాస్తవం. ఈ ప్రశ్నకు నిర్మాత దిల్ రాజు తాజాగా క్లారిటీ ఇచ్చేశారు. ఈ సినిమా ప్రీమియర్ షోలు ఖచ్చితంగా ఉంటాయని.. అయితే, పక్కా ప్లానింగ్‌తో పాటు కనీవినీ ఎరుగని రేంజ్ లో ... రికార్డు స్థాయిలో ఈ ప్రీమియర్ షోలు ఉంటాయని ఆయన తెలిపారు. ఇక పుష్ప 2 ప్రీమియర్ షో లు రికార్డు స్థాయిలో ఎలా ప్లాన్ చేశారో ? అంతకు మించి గేమ్ ఛేంజర్ ప్రీమియర్లు నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. పైగా పుష్ప 2 ప్రీమియర్ షో లో జరిగిన విషాదం దృష్టిలో పెట్టుకుని, గేమ్ ఛేంజర్ కోసం పక్కాగా ఈ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు.