ఏంటి సమంతహీరో దగ్గర డబ్బులు తీసుకొని దొబ్బేసిందా.. ఇంతకీ టాలీవుడ్ సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉంది.. అసలు సమంత ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంది అనేది ఇప్పుడు చూద్దాం. చాలామంది నటీనటులు సినిమాల్లో నటించడానికి ముందు అగ్రిమెంట్ చేసుకునే సమయంలోనే కొంత రెమ్యూనరేషన్ ని అడ్వాన్స్ గా తీసుకుంటారు.అలా ఇప్పటికే ఎంతోమంది అడ్వాన్సులు తీసుకొని ఆ తర్వాత సినిమాలో జాయిన్ అవుతూ ఉంటారు. అయితే కొంతమంది నటీనటులు అడ్వాన్స్ తీసుకున్నాక కూడా వేరే సినిమాల్లో అవకాశాలు ఉండడం కారణంగా లేదా మరేదైనా కారణాల వల్ల సినిమాల్లో నటించరు. ఇక చాలామంది దర్శక నిర్మాతలు అగ్రిమెంట్ చేసుకున్నాక నటీనటులు షూటింగ్లకి రాకపోతే ఇంటికి నోటీసులు పంపిస్తూ ఉంటారు. లేక ఇండస్ట్రీలో ఉన్న పెద్దలతో వాళ్లకు చెప్పిస్తూ ఉంటారు.

 అలా ఇప్పటికే ఎంతోమంది ఆర్టిస్టులు అగ్రిమెంట్ చేసుకున్నాక షూటింగ్లకి రాకపోవడం వల్ల బ్యాన్ అయిన సందర్భాలు ఉన్నాయి.అయితే తాజాగా సమంత గురించి కూడా ఒక వార్త టాలీవుడ్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. అదేంటయ్యా అంటే.. సమంతకి మయాసైటిస్ వ్యాధి రాకముందు ఓ తెలుగు హీరో సినిమాలో చేస్తాను అని అగ్రిమెంట్ చేసుకుందట. అయితే ఆ తర్వాత మయాసైటిస్ రావడం సినిమాలకు కొద్ది రోజులు బ్రేక్ ఇవ్వడం ఆ తర్వాత బాలీవుడ్ లో బిజీ అవ్వడం జరిగింది. అయితే రీసెంట్ గా సమంత దగ్గరికి ఆ హీరో వెళ్లి మీరు నా సినిమాలో చేస్తానని అప్పుడెప్పుడో కమిట్మెంట్ ఇచ్చారు. ఇప్పటివరకు చేయడం లేదు. ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ చేద్దామని అనుకుంటున్నాము.మీరు డేట్స్ ఎప్పుడు ఇస్తారు అని అడిగారట.దానికి సమంత ప్రస్తుతం నేను తెలుగు సినిమాల్లో నటించకూడదు అనుకుంటున్నాను.

 ఒకవేళ నటించినా కూడా కేవలం లేడీ ఓరియంటెడ్ మూవీస్ మాత్రమే చేయాలి అనుకుంటున్నాను. అందుకే నాకు తెలుగు సినిమాల్లో నటించే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను మీ మూవీలో నటించను అని మొహం మీద చెప్పేసిందట.దాంతో చిర్రెత్తుకొచ్చిన ఆ హీరో వెంటనే వెళ్లి సమంత చేసిన అగ్రిమెంట్ ని చూపిస్తూ సమంత ఇంటికి లీగల్ నోటీసులు పంపించారని తెలుస్తోంది.ఇక సమంత ఇంటికి నోటీసులు వెళ్లడంతో సమంతకి పెద్ద షాక్ తగిలిందని తెలుస్తోంది. అయితే గతంలో సమంత ఆ హీరోతో ఓ సినిమాలో కూడా చేసింది.ఇక ఆ కాంబో బాగుండడంతో మరో సినిమాకి కూడా ఓకే చేసింది. కానీ మయాసైటిస్ తర్వాత తెలుగు సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన సమంత ప్రస్తుతం ఆ హీరో సినిమాలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో కోపంతో ఆ హీరో సమంత ఇంటికి లీగల్ నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: