కానీ ఈసారి మాత్రం వైరల్ అయ్యే వార్త నిజమే అంటూ కీర్తి సురేష్ తండ్రి అనౌన్స్ చేయడంతో జనాలు షాక్ అయిపోయారు. ఓ పక్క కీర్తి సురేష్ పెళ్లి చేసుకుంటుంది..లైఫ్ లో సెటిల్ అవ్వబోతుంది అని హ్యాపీగా ఫీల్ అయ్యే జనాలు.. మరోక పక్క ..అయ్యయ్యో కీర్తి సురేష్ పెళ్ళి చేసేసుకుంటుందే అంటూ బాధపడిపోయిన జనాలు ఇద్దరు ఉన్నారు. కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి . డిసెంబర్ 12వ తేదీ గోవాలో ట్రెడిషనల్ గా వాళ్ళ సంప్రదాయ ప్రకారం వైష్ణవ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు.
ఆ తర్వాత ఆంటోనీ తట్టిల్ క్రిస్టియన్ గనుక చర్చ్ పద్ధతులను ఫాలో అవుతూ మరొకసారి పెళ్లి చేసుకున్నారు . అంతే కాదు వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి .. కీర్తి సురేష్ - ఆంటోనీ తట్టిల్ పెళ్లికి స్పెషల్గా హాజరయ్యారు . ఆయన వీళ్ల పెళ్లిలో సందడి చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి . అంతేకాదు కీర్తి సురేష్ కు ఇష్టమైన "నేతి కజ్జికాయలను" ఆయన గిఫ్ట్ బాక్స్ ప్యాక్ చేసి మరి పెళ్లికి తీసుకెళ్లారట . అది చూసి అక్కడ ఉండే వాళ్ళు..ఆంటోని తట్టిల్.. కుటుంబ సభ్యులు తెగ నవ్వకున్నారట . కీర్తి సురేష్ కి నేతి కజ్జికాయలు అంటే చాలా చాలా ఇష్టం . ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది . కీర్తి సురేష్ కి ఇష్టమైన విషయం తెలుసుకున్న విజయ్ దళపతి స్పెషల్గా ఇంటి వాళ్లతో వండించి మరి ఆమె కోసం అవి తీసుకెళ్లారట . ప్రజెంట్ ఈ న్యూస్ కోలీవుడ్ ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది..!