టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ ఎవరనే చర్చ చాలా సంవత్సరాల నుంచి నడుస్తోంది. చిరంజీవి సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లో బిజీ అయిన తర్వాత నుంచి ఈ చర్చ మొదలైంది. బాహుబలి, బాహుబలి2 సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన తర్వాత స్టార్ హీరో ప్రభాస్ నంబర్ వన్ అని అందరూ ఫిక్స్ అయ్యారు. ప్రభాస్ తర్వాత సినిమాలు సైతం భారీ బడ్జెట్ తో తెరకెక్కి భారీ కలెక్షన్లు సాధించాయి.
 
ఒకానొక సమయంలో వరుస ఫ్లాపులు ప్రభాస్ ను ఒకింత ఇబ్బంది పెట్టినా సలార్, కల్కి సినిమాలు ప్రభాస్ కు ప్లస్ అయ్యాయి. బన్నీ పుష్ప2 సినిమా తాజాగా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. బుక్ మై షోలో ఒక్కరోజులో అత్యధిక టికెట్స్ బుక్ అయిన సినిమాగా పుష్ప2 నిలిచింది. ఈ సినిమాకు సంబంధించి ఒక్కరోజులోనే ఏకంగా 10.8 లక్షల టికెట్లు బుక్ అయ్యాయని సమాచారం అందుతోంది.
 
ఈ ఏడాది చాలా పెద్ద సినిమాలు విడుదలైనా పుష్ప2 సినిమా సాధించిన రికార్డ్ సంచలన రికార్డ్ కావడం గమనార్హం. పుష్ప ది రూల్ మూవీ ఎనిమిది వారాల వరకు ఓటీటీలో రిలీజయ్యే ఛాన్స్ లేదని మేకర్స్ చెబుతున్నారు. ఈ నిబంధన హిందీ వెర్షన్ కు మాత్రమే వర్తిస్తుందా? లేక అన్ని వెర్షన్లకు వర్తిస్తుందా? అనే ప్రశ్నకు జవాబు తెలియాల్సి ఉంది. పుష్ప2 సినిమా సాధిస్తున్న కలెక్షన్లు ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి.
 
పుష్ప ది రూల్ మూవీ 700 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కి బడ్జెట్ కు రెట్టింపు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోని భారీ బడ్జెట్ సినిమాలలో ఇది ఒకటి కాగా కలెక్షన్ల విషయంలో సైతం ఈ సినిమా అదరగొడుతోంది. పుష్ప ది రూల్ ఇతర భాషల్లో సైతం అదరగొడుతోంది. హిందీలో వందేళ్ల చరిత్రను సైతం ఈ సినిమా తిరగరాసింది. పుష్ప ది రూల్ రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: