తెలుగులో అయితే ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఒక తమిళ్ బాక్సాఫీస్ వద్ద మాత్రం టాకు సంబంధం లేకుండా భారీ కలెక్షన్లు తెచ్చుకుంది. అయితే ఆశించిన స్థాయిలో సినిమా లేకపోవడంతో అభిమానులు ఫీలవుతున్నారు దీంతో తన చివరి సినిమా అంటూ చేస్తున్న తాజా సినిమా విషయంలో మాత్రం మరింత శ్రద్ధ తీసుకుంటున్నాడు విజయ్. ప్రస్తుతం దళపతి 69 సినిమాతో బిజీగా ఉన్నాడు.. ఈ సినిమాకి కోలీవుడ్ స్టార్ దర్శకుడు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు.. అలాగే కన్నడ నిర్మాణ సంస్థ కేవీఎస్ ప్రొడక్షన్స్ ఈ మూవీని నిర్మించడం మరో విశేషం.. అలాగే ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. పూజా హెగ్డే , బాబి డియోల్ , ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో నటిస్తున్నారు. అలాగే మరో మలయాళ నటి మమతా బైజు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. అయితే దళపతి విజయ్ లాస్ట్ సినిమా బాలయ్య భగవంత్ కేసరి కి రీమేక్ అంటూ వార్తలు మొదలయ్యాయి .. ఈ సినిమాలకు కమర్షియల్ అంశాలతో పాటు .. ప్రేక్షకులకు మంచి సందేశం కూడా ఉండటంతో విజయ్ దీనికి ఓకే ఇచ్చారట. అయితే ఇందులో అసలు నిజం వేరే ఉందట. తమిళ మీడియా వర్గాల నూంచి అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ నిజంగా ఈ రీమిక్స్ రైట్స్ కొనుకున్నాడు .. కానీ అఫీషియల్ గా ఈ సినిమా రీమిక్స్ చేయడం లేదు ..
ఈ సినిమాలో వచ్చే కొన్ని పాత్రలు ఒరిజినల్‌కు సిమిలర్గా అనిపించాయి కాబట్టే చిత్ర యూనిట్ ఎలాంటి ఇబ్బంది లేకుండా రీమేక్ రేట్స్ ని కొనుగోలు చేశారట. దళపతి 69 సినిమాలో మరో హీరోయిన్ అయన మమతా బైజు .. విజయ్ కూతురుగా ఉంటుందట.. ఇక అలాగే భగవంత్ కేసరిలో కూడా బాలకృష్ణ శ్రీలీల మధ్య ఉండే రిలేషన్ కూడా ఇలాగే ఉంటుంది. రాబోయే రోజుల్లో కాపీరైట్ సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారని అంటున్నారు. కేవలం ఈ ఒక్క విషయంలోనే పోలిక కానీ మిగతా కథ స్క్రీన్ ప్లే మొత్తం వేరేగా ఉండబోతుందట. పూజ హెగ్డే పాత్ర కూడా తెలుగులో కాజల్ అగర్వాల్ క్యారెక్టర్ ను పోలి ఉంటుందట.. వీరిద్దరి మధ్య మంచి ఫన్ లవ్ ట్రాక్ పాటలు కూడా ఉంటాయి. తెలుగులో మిసస్సైన ఎలిమెంట్స్ ఇక్కడ రికవరీ చేస్తారు. అలాగే భగవంత్ కేసరిలో గుడ్ టచ్ , బ్యాడ్ టచ్ తో పాటు ఆడపిల్లలను పేరెంట్స్ ఎలా పెంచాలని మెసేజ్ ప్రేక్షకులకు బాగా ఎక్కింది. దళపతి 69 తర్వాత విజయ్ రాజకీయాల్లో బిజీ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికి అయిన తన పార్టీని ప్రకటించి తొలి బహిరంగ సభను కూడా ఎంతో గ్రాండ్గా సక్సెస్ చేసుకున్నారు .. అందుకే ఆయన చివరి సినిమాలో సైడ్ ట్రాక్లో రాజకీయాలను టచ్ చేసేలా కథ ఉంటుందని అంటున్నారు .. ఇంకా సినిమా టైటిల్ రివల్ అయిన తర్వాత మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.