ప్రధానంగా వందేళ్ళ బాలీవుడ్ చరిత్రలో పుష్ప 2 తో అల్లు అర్జున్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాడు .. ఇప్పటివరకు హిందీ చిత్ర పరిశ్రమలో ఏ సినిమా కలెక్ట్ చేయని విధంగా కేవలం 15 రోజుల్లోనే 632 కోట్ల 50 లక్షల కలెక్షన్ సాధించిన తొలి ఇండియన్ సినిమాగా పుష్ప2 అరుదైన గణిత సాధించింది. ఇప్పటివరకు హాయ్యెస్ట్ వసూళ్లను సాధించిన సినిమాగా ఉన్న స్త్రీ 2 మూవీ లైఫ్ టైం రన్‌ను ఇప్పుడు కేవలం 15 రోజుల్లోనే పుష్ప2 అధిగమించడం విశేషం .. ఇక వీటితో పాటు అత్యంత వేగంగా 14 రోజుల్లోనే 1500 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించిన తొలి ఇండియన్ సినిమాగా .. అలాగే కేవలం ముంబైలోనే 200 కోట్లు నెట్ కలెక్షన్ సాధించిన తొలి సినిమాగా పుష్ప2 రికార్డ్ క్రియేట్ చేసింది.
ఇక 2024 సంవత్సరంలోనే హైయెస్ట్ గ్రాస్ సాధించిన తొలి ఇండియన్ సినిమాగా రికార్డు నమోదు చేసింది. ఇక అల్లు అర్జున్ తన కెరియర్ లో పుష్ప 1న్ పుష్ప 2 రూల్ సినిమాలతో 2021 మరియు 2024 లో బ్యాక్ టు బ్యాక్ హైయెస్ట్ గ్రాసర్స్ వసూలు చేసిన ఇండియన్ సినిమాల హీరోగా సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు .. ఇక రాబోయే రోజుల్లో పుష్ప 2 లాంగ్ రన్ మరిన్ని సరికొత్త రికార్డులను అల్లు అర్జున్ తన ఖాతలో వేసుకోబోతున్నాడని ఇండియన్ ట్రేడ్ వర్గాలు అంటున్నాయి .