టాలీవుడ్ ఇండస్ట్రీలో అయినా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అయినా నంబర్ వన్ డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు రాజమౌళి పేరు జవాబుగా వినిపిస్తుంది. రాజమౌళి 100కు 100 శాతం సక్సెస్ రేట్ వల్లే ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారని చెప్పవచ్చు. జక్కన్నకు పోటీగా చాలామంది దర్శకులు జాబితాలో నిలుస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.
 
ప్రశాంత్ నీల్, సుకుమార్, అట్లీ మరి కొందరు దర్శకులు జక్కన్నకు పోటీగా నిలుస్తున్నారు. లోకేశ్ కనగరాజ్, శంకర్ కూడా ఈ జాబితాలో ఉన్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజమౌళికి ఇండస్ట్రీలో టఫ్ కాంపిటీషన్ ఉందని చెప్పడంలో మాత్రం ఎలాంటి సందేహం అయితే అవసరం లేదని చెప్పవచ్చు. రాజమౌళి పారితోషికం కూడా భారీ స్థాయిలో ఉందని తెలుస్తోంది.
 
టాలీవుడ్ స్టార్ హీరోలను మించి రాజమౌళి రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారని సమాచారం అందుతోంది. మహేష్ రాజమౌళి కాంబినేషన్ ఇండస్ట్రీని షేక్ చేసే కాంబినేషన్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాజమౌళి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.
 
స్టార్ డైరెక్టర్ రాజమౌళి తర్వాత ప్రాజెక్ట్స్ గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం. రాజమౌళి సైతం పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ లపై ఫోకస్ పెడుతూ నిదానంగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు. 2027 సంవత్సరంలో లేదా 2028 సంవత్సరంలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. రాజమౌళి నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటుండగా అదే సమయంలో భాషతో సంబంధం లేకుండా ఎదుగుతున్నారు. మహేష్ సినిమాతో రాజమౌళి క్రియేట్ చేసే రికార్డులు మామూలుగా ఉండవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజమౌళి డైరెక్షన్ స్కిల్స్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి తన టాలెంట్ తో ప్రశంసలు అందుకుంటున్నారు. రాజమౌళికు ఎవరూ పోటీ లేరని ఎవరూ సాటిరారని నెటిజన్ల్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.












మరింత సమాచారం తెలుసుకోండి: