సౌత్ దర్శకులు నార్త్‌లో హల్‌చల్ చేయడం ఎప్పటి నుంచో ఉంది. ఈ మధ్యకాలంలో రాజమౌళి, సుకుమార్ వంటి దర్శకులు బాలీవుడ్ దర్శకులకు సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో షారుఖ్ జవాన్ మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు దర్శకుడు అట్లీ.స్వతహాగా దర్శకుడు కావాలన్న కోరిక బలంగా ఉన్న అట్లీ.. ముందుగా దర్శకుడు శంకరర్ దగ్గర ‘ఎంథిరన్ , నన్‌బన్ చిత్రాలకు అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేశారు. ఆ తర్వాత తనే సొంతంగా 2011లో ‘ముగపుతగమ్’ అనే షార్ట్ ఫిల్మ్‌ను డైరెక్ట్ చేశారు. ఈ మూవీతో దర్శకుడిగా అట్లీ కెపాసిటీ ఏంటో అందరికీ తెలిసొచ్చింది. ఆ షార్ట్ ఫిల్మ్ ఇచ్చిన ధైర్యంతో దర్శకుడిగా అడుగులు వేసాడు.అలా తను అసిస్టెంట్‌గా ఉన్నపుడు రాసుకున్న స్టోరీతో ‘రాజా రాణి’  పేరుతో ఫ్యాక్స్ స్టార్ స్టూడియోస్‌, ఏ.ఆర్.మురుగదాస్ మరో నిర్మాతగా వ్యవహరించారు. 2013లో విడుదలైన ఈ సినిమాను అదే పేరుతో విడుదల చేసారు. ఇందులో ఆర్య, నయనతార హీరో, హీరోయిన్లుగా నటించారు. స్మాల్ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ. 100 గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దర్శకుడిగా అట్లీ పేరు మారు మ్రోగేలా చేసింది.ఇదిలావుండగా జవాన్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు డైరెక్టర్ అట్లీ.

బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, నయనతార, దీపికా పదుకొణే నటించిన ఈ మూవీ దాదాపు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా తర్వాత అట్లీ రూపొందించే ప్రాజెక్ట్స్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తాజాగా తన ఆరో సినిమాను ప్రకటించారు అట్లీ. ఈ క్రమంలో నే ఇప్పుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి సినిమాలకు మించి బొమ్మ పడేస్తానంటున్నాడు తమిళ దర్శకుడు అట్లీ.డైరెక్టర్ అట్లీ తన నెక్ట్స్ మూవీ అవుట్ ఆఫ్ ది వరల్డ్ అంటూ ప్రకటించేశారు. దీంతో అట్లీ నెక్ట్స్ మూవీపై అనౌన్స్ రాకముందే స్పెషల్ బజ్ క్రియేట్ అయ్యింది.ఇక అప్పటి నుంచి అట్లీ 6వ ప్రాజెక్ట్ రాజమౌళి సినిమాకు సవాల్‌ విసిరేలా వస్తుందంటూ ఓ ప్రచారం జరుగుతోంది. ఇటు రాజమౌళి కూడా తన నెక్ట్స్ మూవీ పాన్ వరల్డ్ అంటున్నారు. ఇప్పడు అట్లీ కూడా పాన్ వరల్డ్ జపం చేస్తూ.. టెక్నీషియన్లను హలీవుడ్ నుంచి తీసుకువస్తున్నారట. అంతే కాదు రాజమౌళి సినిమా కంటే ముందే.. సెట్స్ మీదకు తీసుకెళ్లాలని అట్లీ ఆతృతగా ఉన్నారట. ఇన్నాళ్లకి రాజమౌళికి సరితూగే డైరెక్టర్ దిగిపోయాడని టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: