హరిహర వీరమల్లు కోసం రీసెంట్గా డేట్స్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ .. ఆయన ఇచ్చిన కొన్ని కాల్షీట్స్‌నే బంగారంలా వాటేసుకున్నారు చిత్ర యూనిట్.
మరోవైపు ఓజి దర్శకుడు సుజిత్ అయితే ఎవరు ఊహించని లేవల్ .. పవన్ కళ్యాణ్ లేకుండానే ఓజి కొత్త షెడ్యూల్ మొదలు పెట్టేసారు .. అంతేకాకుండా తాజాగా డీజే టిల్లు ఫేమ్ నేహశెట్టి తో థాయిలాండ్ లో ఓ స్పెషల్ సాంగ్ కూడా షూట్ చేస్తున్నారు .. ఈ నెల చివర్లోని ఓజీ సెట్ లో పవన్ జాయిన్ కానున్నారు.
ఈలోపు ఆయన లేని సీన్స్ షూటింగ్ చక చకా జరుగుతుంది .. బ్యాంకాక్ , థాయిలాండ్ షెడ్యూల్స్ అయిపోతే ఓజి షూటింగ్ దాదాపు 90% కంప్లీట్ అయినట్టే .. అందుకే చెబుతుంది చట్టం తన పని తాను చేసుకుపోతుందని .. పవన్ కళ్యాణ్ లేకున్నా షూటింగ్స్ ఆగట్లేదు .. అన్ని అనుకున్నట్లు కుదిరితే 2025 లో జనసేనాని నుంచి డబల్ ట్రీట్ ఖాయమని కూడా చెప్పవచ్చు .. ఇప్పటికే 2025 మార్చ్ 25న హరిహర వీరమల్లు ప్రేక్షకులు ముందుకు రాబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది .. అలాగే ఓజీ కూడా 2025 అక్టోబర్ లేదా డిసింబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలా 2025 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ నుంచి అభిమానులకు డబల్ ట్రీట్ ఇవ్వడం ఖాయం.