మెగాస్టార్ అంటే వెండితెర మెగాస్టార్ కాదండోయ్. బుల్లితెర మెగాస్టార్ గురించి మీకు తెలిసే ఉంటుంది. బుల్లితెర నటుడు ప్రభాకర్ తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితుడే. తెలుగు టీవీ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్న ప్రభాకర్ ఎన్నో సంవత్సరాలు పాటు సూపర్ హిట్ సీరియల్లలో నటిస్తూ.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఎక్కువగా ఈటీవీ లో ప్రసారమయ్యే సీరియల్లో నటించడంతో ఆయన ఇంటి పేరు కూడా ఈటీవీ అయిపోయింది. దాంతో ఆయనని 'ఈటీవీ ప్రభాకర్' అని పిలవడం స్టార్ట్ అయింది. ఆయన ప్రొఫెషనల్ లైఫ్ లో ఎంతో సక్సెస్ అందుకున్న.. పర్సనల్ లైఫ్ లో కొన్ని తప్పులు చేశానని, తానే ఆమధ్య స్వయంగా ఓ మీడియా వేదికగా ఒప్పుకోవడం జరిగింది.

సాధారణంగా ఇండస్ట్రీలో రూమర్స్ అనేవి చాలా కామన్. ఓ అమ్మాయి, ఓ అబ్బాయి తో కలిసి తిరిగితే వారి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ఏదో ఒక రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది మీడియా. ఈ రూమర్స్ అనేవి రియల్ లైఫ్ లోను.. రీల్ లైఫ్ లోను.. ఎప్పుడూ హాట్ టాపిక్ గానే నిలుస్తాయి. ఇందులో కొన్ని రూమర్సులలో నిజాలు లేకపోలేవు. అయితే వాటిని తప్పు అని ఒప్పుకునేవారు కొందరు మాత్రమే ఉంటారు. ఈ క్రమంలో తమ తప్పుల్ని తెలుసుకొని తమ జీవితాన్ని సరిదిద్దుకునే కొంతమంది ఉంటారు. అందులో ఒక్కరు బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్. ప్రభాకర్ తన జీవితంలో జరిగిన తప్పుని సరిదిద్దుకోవడానికి, తన జీవితంలో వచ్చిన మరో వ్యక్తి కారణమంటూ చెప్పుకొచ్చారు.

అవును, ఈటీవీ ప్రభాకర్ తన జీవితంలో చేసిన తప్పు గురించి ఓ యూట్యూబ్ ఇంటర్య్వూలో చెప్పుకు రావడం కొసమెరుపు. ప్రభాకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను ప్రేమించి.. పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నానని, తన వివాహం ఆర్య సమాజంలో స్నేహితుల సమక్షంలో మాత్రమే జరిగిందని పేర్కొన్నారు. అయితే తన ఆవిడ (మలయజ) తనని ఎంతగానో నమ్మి తన జీవితంలోకి వచ్చిందని చెప్పుకొచ్చారు. అలాంటి అమ్మాయిని కొన్ని విషయాలలో తాను చాలా బాధ పెట్టానని కూడా ఫీలయ్యాడు. ఒకానొక సమయంలో తాను తెలుసో.. తెలియకో ఇంకొకరితో రిలేషన్ లో ఉండడం వల్ల తన భార్య ఎంతగానో బాధ పడిందని, తనకు చెప్పుకోలేక ఎంతో బాధపడిందని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: