ప్రస్తుతం అంతా ఎక్కువగా డిజిటల్ యగమే నడుస్తూ ఉన్నది.. ప్రజలు ఎక్కువగా మొబైల్ లోనే తమ సినిమాలను చూస్తూ ఉన్నారు. మరి కొంతమంది ఓటీటీ అటు టీవీ ,మొబైల్స్ రెండులలో కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. జనం థియేటర్ కి రావాలి అంటే సినిమా టాక్ భారీ స్థాయిలో ఉంటేనే తప్ప.. టికెట్లు బుకింగ్ కావడం కష్టంగా మారుతోంది. ఎంతటి స్టార్ హీరో అయినా సరే నెగిటివ్ టాక్ వచ్చిందంటే మాత్రం ఆ వైపుగా ప్రేక్షకులు వెళ్లడానికి కూడా మక్కువ చూపడం లేదు. అయితే కొన్నిచోట్ల ఇప్పటికే సినిమా పాస్ విధానాన్ని మల్టీప్లెక్స్ థియేటర్లో సైతం అమలు చేశాయి.


వీటివల్ల నెలలో సినిమాలు ఎన్ని విడుదలైన చూసుకొనే సదుపాయాన్ని కూడా కలిగించింది. ఇలా ఇవే కాకుండా ప్రేక్షకులను థియేటర్కు రప్పించడానికి ఎన్నో రకాల విధానాలను ప్రవేశపెడుతున్నారు. అయితే ఇప్పుడు FLEXI అనే విధానాన్ని పివిఆర్ పరిచయం చేయబోతోంది.. థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడు షో మధ్యలో నుంచి సినిమా నచ్చక వెళ్లాలనుకుంటే వీక్షణ శాతాన్ని బట్టి టికెట్ డబ్బులు వెనక్కి చెల్లించే విధంగా ఒక విస్తృత ఆలోచనతో ప్రయోగం చేయబోతున్నారు పివిఆర్.


ప్రేక్షకులు సినిమా థియేటర్లో సినిమా నచ్చకపోయినా పనిమీద బయటికి వెళ్లాల్సి ఉన్నప్పటికీ షో మధ్యలో నుంచి వెళ్లిపోవచ్చట.. అయితే థియేటర్లో నుంచి బయటికి వెళ్లేటప్పుడు 75% కంటే ఎక్కువ సినిమా ఉంటే అలా వెళ్ళిన వారికి 60 శాతం తిరిగి ఇస్తారట. ఇలా సినిమా చూసిన దాన్నిబట్టి డబ్బులను వాపస్ చెల్లిస్తారట. మొదట ఇలాంటివి న్యూఢిల్లీ, బోర్గావులో 40 థియేటర్లలో వీటిని ప్రయోగం చేయబోతున్నారట. అక్కడ సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా అన్ని థియేటర్లలో కూడా అమలు చేసేలా పివిఆర్ ప్రయత్నం చేస్తుందట. ప్రస్తుతం మారుతున్న ప్రజల జీవన శైలి వల్ల పివిఆర్ ఈ ఫ్లెక్సీ విధానాన్ని అమలు చేయబోతున్నారట. మరి వీటి వల్ల ఆయన ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: