ఫ్రీ బుకింగ్ విషయంలో కూడా యూఐ మూవీ రికార్డులు క్రియేట్ చేస్తుందని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు .. అలాగే సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేయడం కోసం ఉపేంద్ర అనే స్వయంగా అన్ని భాషల్లో ప్రమోషన్స్ కూడా చేశారు .. టీజర్ , ట్రైలర్ కూడా అందర్నీ ఆకట్టుకోవడంతో ఉపేంద్ర స్టైల్ సినిమాను ఆశిస్తూ అభిమానులు అంతా థియేటర్లకు క్యూ కట్టారు. అందరూ అనుకున్నట్టుగానే సినిమాకు చాలా వరకు పాజిటివ్ టాక్ వచ్చింది. కొందరు ఈ సినిమా అసలు బాలేదని చెప్పినా కూడా చాలామందికి మాత్రం ఈ సినిమా బాగా నచ్చింది .. అందుకే ఫ్రీ బుకింగ్ విషయంలో మాత్రమే కాకుండా ఓపెనింగ్ విషయంలో కూడా యూఐ దూసుకుపోతుంది. ఇక తొలిరోజు యూఐ మూవీ రూ. 6.75 కోట్ల కలెక్షన్లు రాబట్టి అందరికీ షాక్ ఇచ్చింది .. 2024 లో కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి విడుదలైన సినిమాలలో మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా యూఐ మూవీ రికార్డులు క్రియేట్ చేసింది. ఇక దీంతో ఉపేంద్ర గ్యాప్ వచ్చినా కూడా ఆయన ఇంకా ఫామ్ లోనే ఉన్నారని అభిమానులు ఆనందపడుతున్నారు.
కన్నడ తో పాటు ఇతర భాషల్లో కూడా డిసెంబర్ 20న ఈ సినిమా రిలీజ్ అయింది.. అందుకే ఈ కన్నడలో ఈ సినిమాకు తొలిరోజు 6 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి.. హిందీలో లక్ష , కోలీవుడ్ లో 4 లక్షలు , తెలుగులో 70 లక్షల కలెక్షన్స్ సాధించింది. ఉపేంద్ర నటించిన సినిమాలన్నీ రియాల్టీకి దగ్గరగా ఉంటాయి .. అవి చూసే ప్రేక్షకులకు మాత్రం నిజంగా ఇలా జరిగితే ఎలా ఉంటుందో అని ఆలోచన వచ్చేలా చేస్తాయి. యూఐ మూవీ కూడా అలాంటిదే అని టీజర్ , ట్రైలర్ చూసిన చాలామంది ప్రేక్షకులు అనుకున్నారు .. అదే విధంగా చాలామందికి ఈ మూవీ నచ్చింది. ఇదేవిధంగా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది .. ఈ సినిమాకు మరింత కలెక్షన్లు పెరిగే అవకాశం కచ్చితంగా ఉంది. ఇలా కేజిఎఫ్ కి పోటీ అయిన కాకపోయినా గుర్తుండిపోయే కన్నడ సినిమాల్లో యూఐ మూవీ కూడా ఉంటుందని ప్రేక్షకులు అంటున్నారు.