అంతకు ముందు కూడా మెగా అభిమానులు చాలామంది అల్లు అర్జున్ పేరుని ట్రోలింగ్ కి గురి చేశారు . కానీ ఈసారి మాత్రం చాలామంది జనాలు ఆయన పేరుకు సంబంధించి నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు . అల్లు అర్జున్ కావాలని సంధ్య థియేటర్ దగ్గర రోడ్ షో చేయడం.. ఓవరాక్షన్ చేస్తూ కారులో నుంచి పైకి వచ్చి చేతులు ఊపడం లాంటివి చేశాడు అని.. ఆయన కారణంగా ఒక నిండు ప్రాణం బలైపోయింది అంటూ తిట్టిపోస్తున్నారు . అయితే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాగైనా ఈ సినిమా హిట్ అవుతుంది అని ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేయడానికి క్రిస్మస్ హాలిడేస్ లో సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళాలి అంటే డిసైడ్ అయిపోయారట.
దానికి సంబంధించి టికెట్స్ కూడా బుక్ చేసుకునేసారట . న్యూ ఇయర్ కూడా అల్లు అర్జున్ ఆ కంట్రీ లోనే జరుపుకొని ఉండాల్సిందట. అల్లు అర్జున్ - స్నేహారెడ్డి - అల్లుఅర్హా- అయ్యాన్ .. పారిస్ కి వెళ్లడానికి టికెట్స్ బుక్ చేసుకున్నారట. కానీ ఎవరు ఊహించని విధంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అవ్వడం బెయిల్ రావడం జరిగింది . అయితే పోలీసులు కొన్ని షరతులు పెట్టారట . అల్లు అర్జున్ సిటీ దాటి ఎక్కడికి బయటికి వెళ్ళకూడదు అంటూ ఒక కండిషన్ పెట్టారట. దీంతో అల్లు అర్జున్ ఫస్ట్ టైం బుక్ చేసుకున్న టికెట్లు క్యాన్సిల్ చేసే పరిస్థితి వచ్చింది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . ఇప్పటివరకు అల్లు అర్జున్ ఎప్పుడు కూడా ఇలా చేయలేదట . ఫ్యామిలీతో ఏదైనా ట్రిప్ వేస్తే కచ్చితంగా అక్కడికి వెళ్లేవారట . కానీ ఈసారి మాత్రం ఆ ఛాన్ మిస్ అయిపోయింది అంటున్నారు జనాలు..!