ఇక దర్శకుడు విజయ్ భాస్కర్ కి మన్మధుడు కథను చెప్పాడు త్రివిక్రమ్ .. అలాగే అక్కినేని నాగార్జున ను కలిసి త్రివిక్రమ్ , విజయ్‌భాస్కర్ ఇద్దరూ మా దగ్గర కథ ఉంది మీకు మాత్రమే అది సూట్ అవుతుంది కొంచెం వింటారా ? అని అడిగారట.. ఇక వెంటనే నాగార్జున ఒప్పుకుని ఆ కథను విన్నారట .. ఇక త్రివిక్రమ్ కథ చెప్పగానే నాగార్జున మొహాల్లో ఆశ్చర్యం కనిపించింది .. కథ రెండు గంటలసేపు విన్న తర్వాత కానీ నాగార్జునకి స్టోరీ అర్థం కాలేదు .. స్టోరీ చాలా బాగా రాశారని సినిమాకి ఓకే చెప్పారు నాగార్జున .. అలాగే నిర్మాత గురించి మీరేం టెన్షన్ పడొద్దు.. ప్రతి మూడు సంవత్సరాలకు ఓసారి ప్రొడ్యూస్ చేసే అన్నపూర్ణ బ్యానర్ లోనే నేనే ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తానని నాగార్జున హామీ ఇచ్చారట. మీరు మిగతా నటినటలు సినిమాకు సంబంధించిన పనులు మొదలుపెట్టండి అని చెప్పారట.. ఈ సినిమాకు సినిమా ఆటోగ్రాఫర్ గా సమీర్ రెడ్డి , మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీప్రసాద్ ని సెలెక్ట్ చేశారు..
అలాగే ఈ సినిమాలో నాగార్జున హాస్పటల్ సిన్‌ను హైదరాబాదులోని ఇంద్రనగర్ లోని ఉషా ముళ్లపూడి ఆసుపత్రిలో తెర్కకించారు. క్లైమాక్స్ ను పశ్చిమగోదావరిలో తెరకెక్కించారు. ఇలా చివరగా సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న మన్మథుడు డిసెంబర్ 20 2002లో థియేటర్లోకి వచ్చింది. ధర్మవరపు సుబ్రమణ్యం కామెడీ ప్రేక్షకులను మెప్పించింది. అలాగే సునీల్ కామెడీ కూడా ఆకట్టుకుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం సినిమాకి హైలెట్గా నిలిచింది. త్రివిక్రమ్ డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. ఇక ఈ సినిమాతో త్రివిక్రమ్ తెలుగు సినిమాకి కొత్త మార్కును చూపించాడు. అలాగే ఈ సినిమాతోనే నాగార్జునకి మన్మధుడు అనే బిరుదు కూడా వచ్చి చేరింది .. ఇలా మన్మధుడు సినిమాలో తరుణ్ కాకుండా నాగార్జున హీరోగా వచ్చి టాలీవుడ్ లోనే గొప్ప సినిమాగా మిగిలింది.