మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .. స్వయంకృషి తో ఎంతో కష్టపడి స్టార్ హీరోగా ఎదిగారు చిరంజీవి .. మామూలు నటుడు నుంచి ఓ హీరో గానే కాకుండా మెగాస్టార్ గా టాలీవుడ్ కే గాడ్ ఫాదర్గా ఎదుగాడు చిరంజీవి. అయితే అప్పట్లో చిరంజీవి చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యేది. ఇప్పుడు అలాంటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వాటికి ప్రత్యేక ఉదాహరణ బోళా శంకర్ , ఆచార్య సినిమాలు అట్టర్ ప్లాఫ్ కావడమే .
అయితే ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాపై గతంలో టాలీవుడ్ సీనియర్ నిర్మాత అశ్వనీ దత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు .. చిరంజీవి హీరోగా జై చిరంజీవ సినిమా వచ్చిన విషయం అందరికీ తెలిసిందే .. అయితే ఈ సినిమాలో చిరంజీవికి జంటగా భూమికా మరియు సమీరారెడ్డి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించగా.. స్టోరీని త్రివిక్రమ్ అందించారు.. 2006లో రిలీజ్ అయిన జై చిరంజీవ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆఫ్టర్ ప్లాఫ్ గా మిగిలింది.. చిరంజీవి మరియు అశ్వినిద్దత్ కాంబోలో వచ్చిన జై చిరంజీవ సినిమా .. ఇద్దరికీ ఇది నాలుగో సినిమా.
అయితే జై చిరంజీవ సినిమా అట్టర్ ప్లాఫ్ అవటంపై అశ్వినీ దత్ సంచలన వ్యాఖ్యలు చేశారు .. ఈ సినిమా షూటింగ్లో భాగంగా చిత్ర యూనిట్ అమెరికాకు వెళ్లారు .. ఆ సమయంలో కథ ఇచ్చిన త్రివిక్రమ్ అమెరికాకు రాలేదని అశ్వినీ దత్ అన్నారు .. అలాగే హీరోయిన్ సమీరా రెడ్డి ఐరన్ లెగ్ .. ఈ సినిమాలో ఆమెను పెట్టుకోవాలని త్రివిక్రమే సూచించినట్లు అశ్వినీదత్ చెప్పుకొచ్చారు .. అలాగే ఆమె కోసం ప్రత్యేకమైన సీన్లు కూడా త్రివిక్రమ్ రాశారని ఆయన అన్నారు .. కానీ సినిమాల్లో సమీరా రెడ్డి చేసిన సీన్‌లు అసలు బాగాలేదని చివరికి జై చిరంజీవ సినిమా అట్టర్ ప్లాఫ్ అయిందని చెప్పుకొచ్చారు .. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ పై ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ..