ఐకన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 హిట్ కొట్టి ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు. స్టార్ హీరో అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తీసిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న విడుదలైంది. అయితే ఇప్పటికే పార్ట్ వన్ హిట్ కొట్టడంతో ప్రేక్షకుల అంచనాలకు మించి ఈ సినిమాను తీశారు. ఇకపోతే పుష్ప 2  మూవీ యాక్షన్ ఎపిసోడ్ గూస్ బంప్స్ ఇచ్చిందని టాక్ కూడా వినిపించింది. అలాగే స్క్రీన్ ప్లే, యాక్షన్ సీక్వెన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అన్నీ నెక్స్ట్ లెవల్లో ఉన్నాయని అభిమానులు తెలిపారు.
ఇక అల్లు అర్జున్ ఓ పాటలో వేసిన అమ్మవారి గెటప్ కి మాత్రం ఫాన్స్ పెరిగిపోయారు.. ఆ పాటలో ఆయన యాక్టింగ్ కి ప్రశంసల వర్షం కురిసిందనే చెప్పాలి. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడీగా రష్మిక మందన్న నటించింది. ఆమె కూడా భార్య పాత్రకు నిలువెత్తు రూపంగా నిలిచిందని అంటున్నారు. ఇదిలా ఉండగా, పుష్ప 2 సినిమా క్వాలిటీ ప్రింట్ లీక్ అయిందంటూ.. జనవరి 9 నుంచి ఓటీటీలోకి పుష్ప 2 వచ్చేస్తోందంటూ రూమర్లు వస్తున్నాయి. దీంతో పుష్ప 2 సినిమా ఓటీటీ రిలీజ్ పై చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. పుష్ప 2 ఓటీటీలోకి వస్తుందంటూ వస్తున్న వార్తలను ఖండించింది.  
8 వారాల పూర్తి అవ్వాలని, పూర్తి అవ్వనిదే ఏ ఫ్లాట్ ఫాంలోనూ రాదని చెప్పింది. 56 రోజుల తరువాతనే పుష్ప 2 ఓటీటీలోకి వస్తుందని తెలిపింది. రూమర్లను నమ్మకండంటూ చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. అంటే ఈ  సినిమా జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరి ఆరంభంలోనే ఓటీటీలోకి వస్తుందని అర్దం. ఇక ఇప్పటికే చాలా చోట్ల పుష్ప 2 ప్రింట్స్ ఆన్ లైన్‌లోకి వచ్చాయని.. థియేటర్లో డబ్బులు పెట్టి సినిమాని ఎవరు చూస్తారు? అంటూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మరి నిజంగానే పుష్ప 2 ఆన్ లైన్ లోకి వచ్చిందా? లేదా? అన్నది తెలియడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: