టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన గురించి ప్రెస్ మీట్ పెట్టడంతో పాటు కీలక వ్యాఖ్యలు చేశారు. అనుమతులు లేకుండా నేను వెళితే పోలీసులు రిటర్న్ పంపించేవారని బన్నీ తెలిపారు. నేను చేసింది రోడ్ షో కాదని నా గురించి వైరల్ అవుతున్న తప్పుడు వార్తలు వింటే బాధ వేస్తుందని బన్నీ వెల్లడించడం గమనార్హం. జనం ఎక్కువగా ఉండటంతో రిక్వెస్ట్ చేస్తే నేను కనిపించానని ఆయన తెలిపారు.
 
నేను చెబితే మాత్రమే అభిమానులు వింటారని కాబట్టి చెప్పానని బన్నీ వెల్లడించారు. థియేటర్ కు వెళ్లిన తర్వాత సినిమా చూస్తున్న సమయంలో నన్ను పోలీసులు ఎవరూ కలవలేదని ఆయన తెలిపారు. బయట ఓవర్ క్రౌడ్ అవుతుందని నా మేనేజ్మెంట్ చెబితే నేను వెళ్లిపోయానని బన్నీ పేర్కొన్నారు. నన్ను పోలీసులు ఎవరూ కలవలేదని ఆయన వెల్లడించారు.
 
రేవతి మృతి గురించి, శ్రీతేజ్ గురించి నెక్స్ట్ డే నాకు తెలిసిందని బన్నీ పేర్కొన్నారు. నాకు తెలిసి కూడా సినిమాను చూస్తున్నానని ప్రచారం చేయడం ఘోరం అని బన్నీ వెల్లడించారు. రేవతి మరణవార్త నన్ను బాధ పెట్టిందని ఆయన పేర్కొన్నారు. బన్నీవాస్ ను నేను వెంటనే పంపించానని తాను ఆస్పత్రికి వెళ్తే సమస్య వస్తే కష్టమని బన్నీవాస్ సూచించారని ఆయన వెల్లడించారు.
 
నాపై వాళ్లు కేస్ ఫైల్ చేయడంతో నేను వాళ్లను కలవలేదని బన్నీ కామెంట్లు చేశారు. నేను ఎవరో తెలియని వాళ్లను కలవడానికి వెర్వేరు ప్రాంతాలకు వెళ్లానని నా ఫ్యాన్స్ ను నేను కలవనా అని బన్నీ వెల్లడించారు. నేను కూడా షాక్ లో ఉన్నానని ఆయన పేర్కొన్నారు. మరుసటి రోజు నేను ఒక వీడియో పెట్టానని బన్నీ వెల్లడించారు. ఈ ఘటన తర్వాత పుష్ప2 సెలబ్రేషన్స్ సైతం క్యాన్సల్ చేశామని బన్నీ అన్నారు. బన్నీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: