మూడేళ్ల పాటు కష్టపడిన సినిమా ఎలా ఉందో చూద్దామని థియేటర్ కు వెళ్లానని అంతకు మించి థియేటర్ కు వెళ్లడానికి ఎలాంటి కారణం లేదని ఆయన పేర్కొన్నారు. నేను సుకుమార్ ఎన్నోసార్లు శ్రీ తేజను ఫిజియోథెరపీ చేపిద్దామని అనుకున్నామని బన్నీ వెల్లడించారు. నేను సుకుమార్ మైత్రి వాళ్ళు కలిపి ఓ అమౌంట్ వేసుకొని అతని పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామని కూడా ఎన్నోసార్లు చర్చించుకున్నామని బన్నీ తెలిపారు.
అంతమంది బయట నాకోసం ఎదురు చూస్తున్నప్పుడు నేను కారులో ఉండిపోతే యటికి రాకపోతే నాకు చాలా గర్వం అని అందరూ అనుకుంటారని బన్నీ పేర్కొన్నారు. అక్కడ ట్రాఫిక్ జామ్ అయిందని నేను కారుపైకి వచ్చి అభివాదం తెలియజేస్తూ ఒక్కొక్కరిని ముందుకు వెళ్లాలని సూచించానని బన్నీ పేర్కొన్నారు. జరిగిన ఘటన యాక్సిడెంటల్ ఘటన అని బన్నీ వెల్లడించారు.
సీఎం వ్యాఖ్యల గురించి బన్నీ పరోక్షంగా బన్నీ కౌంటర్ ఇచ్చారు. కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను నోరు స్లిప్ అయితే ఇబ్బందులు ఎదురవుతాయని బన్నీ పేర్కొన్నారు. నేను గతంలో కూడా చాలా సందర్భాల్లో థియేటర్లకు వెళ్లి సినిమాలు చూశానని ఆయన వెల్లడించారు. జరిగిన ఘటన దురదృష్టకరమైన ఘటన అని బన్నీ చెప్పుకొచ్చారు. నేను నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని ఆయన తెలిపారు. అల్లు అర్జున్ నిర్ణయానికి హ్యాట్సాఫ్ అనాల్సిందేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.