స్టార్ హీరో అల్లు అర్జున్ తాజాగా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ రేవతి కుటుంబాన్ని కలవాలని మరుసటిరోజే వెళ్లేందుకు వెళ్లానని బన్నీ తెలిపారు. అక్కడ వ్యవహారాలు చూడాలని వెంటనే నిర్మాత బన్నీ వాసుకు చెప్పానని అల్లు అర్జున్ పేర్కొన్నారు. ఆ టైంలో నా మీద కేసు పెట్టారని తెలియడంతో ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయో అన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్లలేదని బన్నీ పేర్కొన్నారు.
 
రేవతి ఫ్యామిలీని పరామర్శించాలని నాకు ఉండదా అని బన్నీ వెల్లడించారు. గతంలో చిరంజీవి పవన్ కళ్యాణ్ అభిమానులు మృతిచెందితే పరామర్శించేందుకు విజయవాడతో పాటు రాష్ట్రంలో ఎక్కడెక్కడికో వెళ్లానని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. నాకు నా అభిమానులే సర్వస్వం అని బన్నీ వెల్లడించారు. నా అభిమానులకు ఇబ్బంది ఎదురైతే నేను వెళ్ళనా అని అల్లు అర్జున్ ప్రశ్నించారు.
 
ఘటనపై సమాచారం విషయంలో మిస్ కమ్యూనికేషన్ జరిగిందని బన్నీ పేర్కొన్నారు. కొంతమంది చేసిన వ్యాఖ్యలు నన్ను ఎంతో బాధ పెట్టాయని బన్నీ వెల్లడించారు. జాతీయస్థాయిలో నన్ను అప్రతిష్ట పాలు చేశారని బన్నీ పేర్కొన్నారు. తెలుగు వారి ఖ్యాతిని పెంచేలా నేను ఎన్నో సినిమాలలో నటించానని అల్లు అర్జున్ వెల్లడించారు. నాపై వచ్చినవి నూటికి నూరు శాతం తప్పుడు ఆరోపణలు అని బన్నీ పేర్కొన్నారు.
 
రేవంత్ పేరు ఎత్తకుండానే సుతిమెత్తగా అల్లు అర్జున్ కౌంటర్లు ఇవ్వడం గమనార్హం. అల్లు అరవింద్ సైతం మీడియాతో మాట్లాడుతూ తన వంతు సమాచారం ఇచ్చారు. ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండానే బన్నీ తనపై వైరల్ అవుతునన్ వార్తలకు సంబంధించి కౌంటర్ ఇవ్వడం గమనార్హం. మాకు స్పెషల్ ప్రైసెస్ ఇచ్చారని బన్నీ థ్యాంక్స్ చెబుతూనే తన తప్పు లేదని బన్నీ కామెంట్లు చేయడం కొసమెరుపు. 15 రోజులుగా నేను ఇంటికే పరిమితమయ్యానని బన్నీ వెల్లడించారు. నేను ఎక్కడికీ వెళ్లలేకపోతున్నానని బన్నీ పేర్కొన్నారు. బన్నీ చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: