సినిమా రంగంలో హీరోలు .. హీరోయిన్లు - హీరోయిన్లు .. దర్శకులు - హీరోయిన్లు .. నిర్మాతలు కాస్త సన్నిహితంగా ఉంటే లేదా ఒకరు తమ సినిమాలలో పదే పదే ఒక హీరోయిన్ రిపీట్ చేస్తున్న వారి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందన్న అనుమానాలు సహజంగానే ఉంటాయి. ఇది ఇప్పటి నుంచే కాదు కొన్ని దశాబ్దాల నుంచి నడుస్తోంది. ఒక హీరోయిన్ ఇద్దరు స్టార్ దర్శకుల సినిమాలలో ఎక్కువగా నటిస్తూ వారితో గురు శిష్యురాలిలా సంబంధం కొనసాగిస్తూ ఉండడంతో ఆమె భర్త ఆ హీరోయిన్ తీవ్రంగా అవమానించి ఎంతో వేదనకు గురి చేశారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు ? అలనాటి మేటి హీరోయిన్ సుజాత. ఆ దర్శకుడు ఎవరో కాదు ? బాలచందర్ - దాసరి నారాయణరావు. బాలచందర్ కు ఏ హీరోయిన్ అయినా నచ్చితే ఆయన స్టార్ కేరోయిన్ స్టేజ్ కు తీసుకు వెళ్లే వరకు నిద్రపోయే వారు కాదట. దాసరి నారాయణరావు కూడా సుజాతకు ఎన్నో అవకాశాలు ఇచ్చే ప్రోత్సహించారు.
బాలచందర్ దాసరి సినిమాలలో ఎక్కువగా నటించినా సుజాత వారిని తన గురువులుగా భావించింది. ఈ క్రమంలోనే ఈ ఇద్దరి దర్శకుల ఇళ్లలో ఏ శుభకార్యం జరిగిన సుజాత ఎక్కువగా పార్టిసిపేట్ చేసేవారు. ఇది నచ్చని సుజాత భర్త మధుకర్ ఆమెను విపరీతంగా టార్చర్ పెట్టేవాడట. నీకు వారిద్దరితో సంబంధాలు ఉన్నాయా ? చెప్పు .. అసలు ఎంతమందితో నీకు లింకులు ఉన్నాయని దారుణమైన పరిహారంతో ఆమెను టార్చర్ పెట్టేవాడట. చివరకు ఆమె ఆస్తులు అన్ని తీసుకుని అతడు చెన్నై నుంచి ఎర్నాకులం వెళ్లిపోయాడు. సుజాత తన కొడుకు సుజిత్ తో కలిసి చెన్నైలో ఉండిపోయింది. ఆ తర్వాత ఆమె క్యాన్సర్ భారినపడి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఆమె స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే తన భర్త మధుకర్ ఆమె రేంజ్ కు సరిపోయే వ్యక్తి కాకపోయినా ... ఇష్టపడి పెళ్లి చేసుకుని తన జీవితాన్ని నరకం చేస్తుందని చాలామంది అంటూ ఉంటారు.