- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .


సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫార్ములా అనేది ఎవరూ చెప్పలేరు. ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే అదే జోనర్లో సినిమాలు తీయటానికి దర్శకులు ప్రయారిటీ ఇస్తుంటారు. హీరోలు సైతం ఒకప్పుడు హిట్‌ అయిన సినిమా లాంటి కథ కావాలని కండిషన్లు పెట్టేవారు. అలాంటి కండిషన్ వల్ల కొన్నిసార్లు మొదటికే మోసం వస్తుంది. మహేష్ బాబు - ప్రభాస్ - రామ్ చ‌ర‌ణ్ ఇండస్ట్రీ హిట్లు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ను ముంచేశాయి. 2006 ఏప్రిల్ లో విడుదలైన మహేష్ పోకిరి హిట్ అయింది. ఆ సినిమాకు మెహర్ రమేష్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. పోకిరి తరహా ట్విస్టులతో ఎన్టీఆర్ కంత్రి సినిమా తెరకెక్కి డిజాస్టర్ అయింది. పోకిరి సినిమాకు ముందు కంత్రి విడుదలై ఉంటే కంత్రి రిజల్ట్ మరోలా ఉండేదని అభిమానులు భావిస్తారు.


మహేష్ బాబు దూకుడు హిట్ అయ్యాక అదే దర్శకుడుతో కాస్త అటు ఇటుగా అదే స్టైల్ లో ఎన్టీఆర్ బాద్షా సినిమా చేశారు. దూకుడు హిట్ అయిన స్థాయిలో బాద్ షా సక్సెస్ కాలేదు. బాద్ షా క‌మ‌ర్షియ‌ల్ గా కాస్త బ్రేక్ ఈవెన్ కు ద‌గ్గ‌ర కాలేదు. దీనికి ఓవ‌ర్ బ‌డ్జెట్ కార‌ణం. రామ్ చరణ్ మగధీర‌ ఫాలో అయిన ఎన్టీఆర్ శక్తి సినిమాతో ప్లాప్ త‌న ఖాతా లో వేసుకున్నాడు. రభస సినిమా తర్వాత ఎన్టీఆర్ కథల విషయంలో పూర్తిగా మారిపోయాడు. ఇక ఊసరవెల్లి సినిమాలో కిక్ సినిమా పోలికలు కనిపిస్తాయని రామయ్య వస్తావయ్య సినిమాలో రెబల్ పోలికలు కనిపిస్తాయని మరికొందరు ఫీల్ అవుతూ ఉంటారు. ఎన్టీఆర్ ఇద్దరు హీరోల సినిమాలను ఇతర హీరోలకు సూపర్ హిట్ లు ఇచ్చిన డైరెక్టర్లను ఫాలో అయిన సందర్భాలలో చాలాసార్లు చేతులు కాల్చుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: