టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు సూపర్ సక్సెస్ సాధిస్తూ ఒకవైపు తెలుగు సినీ పరిశ్రమను ముందుకు తీసుకు వెళ్తూ ఉండగా ఇలాంటి సందర్భంలోనే పుష్ప 2 సినిమా విడుదలై పాన్ ఇండియా రేంజ్ లో భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంది.. ఇప్పటివరకు ఈ సినిమా 1500 కోట్లకు పైగా కలెక్షన్స్ కూడా రాబట్టి ఇంకా ముందుకు సాగుతోంది. పుష్ప 2 రిలీఫ్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటనలు రేవతి అనే మహిళ మృతి చెందడంతో ఆమె కుమారుడు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు.


ఈ విషయం పైన అల్లు అర్జున్ మీద కేసు ఫైల్ అయ్యింది. దీంతో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకరోజు స్టేషన్లో ఉంచారు.. అయితే చివరికి హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ తీసుకువచ్చి బెయిల్ మీద అల్లు అర్జున్ తిరుగుతూ ఉన్నారు. అయితే ఇటీవలే అసెంబ్లీ సమావేశాలలో సీఎం రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీ పైన చాలా ఫైర్ అయ్యారు.. తన సీఎం పదవిలో ఉండండి రోజులు ఒక్క సినిమాకు కూడా ఎలాంటి బెనిఫిట్స్ షోలు,టికెట్ రేట్స్ పెంచడానికి కూడా పర్మిషన్ ఇవ్వను అంటూ తేల్చి చెప్పారు.



ఈ విషయం పైన కొంతమంది ప్రశంసిస్తూ ఉండగా మరి కొంతమంది మాత్రం నెగిటివ్గా మాట్లాడుతున్నారు.. అల్లు అర్జున్ ను సినీ సెలబ్రిటీలు పరామర్శిస్తున్నారు తాను ఒక్కరోజు జైల్లో ఉన్నందుకే నన్ను దోషిగా చూపిస్తున్నారు కానీ శ్రీ తేజ అనే పిల్లాడు హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు..అతని కోసం ఒక్కరోజైనా ఎవరైనా వెళ్లారా కలిశారా అంటూ తీవ్రమైన స్థాయిలో ఫైర్ అయ్యారు.. చిరంజీవి లాంటి వారితో మంచి అనుబంధం ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి.. అయితే మరి ఇలాంటి సమయంలో ఎందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి వైఖరిని ప్రదర్శిస్తున్నాడని విషయానికి వస్తే.. అల్లు అర్జున్ ఒక ఈవెంట్ లో తెలంగాణ సీఎం అని సంబోధిస్తూ రేవంత్ రెడ్డి అనే పేరును మరిచిపోయారని.. ఈ విషయం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చాలా కోపాన్ని తీసుకు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటిని ఉద్దేశించి సీఎం పేరు గుర్తుకు రావడం కాదు కదా అదొక పీడకల లాగా గుర్తుండి పోవాలని ఉద్దేశంతోనే ఇలా సినీ ఇండస్ట్రీ మీద ఆయన వైఖరి పాటిస్తున్నారని విధంగా కొంతమంది వెల్లడిస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజమందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: