రేవతి కుటుంబ విషయంలో న్యాయవాదుల సూచన మేరకే బన్నీ మాట్లాడుతున్నారని వెల్లడించడం జరిగింది.. అలాగే పుష్ప2తో ఇండియన్ సినిమా రికార్డులన్నిటికీ కూడా బ్రేక్ చేస్తున్న ఫ్యాన్స్ తనని ఎలా రిసీవ్ చేసుకున్నారో చూసుకునే అదృష్టం కూడా తనకు లేకుండా పోయింది అంటూ అల్లు అరవింద్ తెలిపారు. తన కుమారుడు రెండు వారాలుగా గార్డెన్ లో ఒక మూల కూర్చొని ఉన్నాడని తాను వెళ్లి సెలబ్రేషన్స్ ప్లాన్ చేసుకో అని చెప్పగా కనీసం బయటకు కూడా వెళ్లలేదు.. తాను ఎక్కడికి వెళ్ళనని చెప్పాడని అల్లు అరవింద్ తెలిపారు.
పుష్ప 2 సినిమా ఎంత సక్సెస్ అయిన తన అభిమాన ఫ్యామిలీకి ఇలా కావడం చాలా బాధగా ఉందని చెప్పడంతో తనకు కూడా బాధేసిందని తెలిపారు అల్లు అరవింద్. కొన్ని అబద్ధపు ఆరోపణలు రావడంతో క్లారిటీ ఇవ్వాలనుకున్నామని అందుకే ఇలా మాట్లాడామని వెల్లడించారు.. కొన్ని న్యాయపరమైన సమస్యలు ఎదురవుతాయని అందుకే అల్లు అర్జున్ మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయారని.. తను ఈ స్థాయిలోకి రావడానికి 22 ఏళ్లు కష్టపడ్డారని తెలిపారు అల్లు అరవింద్.. ఇదంతా కూడా ఒక రాత్రి, ఒక సినిమా, ఒక ప్రెస్ మీట్ వల్ల రాలేదని మూడు తరాలుగా తమ కుటుంబం గురించి తెలుసు కదా ఇలా వ్యవహరించామా అంటూ.. ఎలాంటి విషయాన్ని కూడా మీ నుంచి తప్పించుకోలేమంటూ మీడియా ముందు తెలిపారు. ఇలాంటి అసత్యపు మాటలు ప్రచారం చేస్తూ ఉంటే బాధగా ఉందంటూ అల్లు అరవింద్ ఎమోషనల్ గా మాట్లాడారు.