నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాటలకు అల్లు అర్జున్ హడావిడిగా ప్రెస్ మీట్ పెట్టి నేను రోడ్ షో చేయలేదు.. ఆ మహిళ చనిపోయినందుకు ఆ బాలుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నందుకు నాకు ఎంతగానో బాధగా ఉంది.అసలు సినిమా హిట్ అయిందని ఆనందం కూడా నాకు లేదు. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము సినిమాలు తీస్తాం.అలాంటిది మాపై ఇలాంటి ఆరోపణ తగదు.ఈ ఆరోపణల్లో నిజం లేదు. నేను ఎంతగానో బాధపడ్డాను అంటూ పరోక్షంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు అల్లు అర్జున్. అయితే అల్లు అర్జున్ గురించి అసెంబ్లీలో ఎంత రచ్చ జరిగిందో చెప్పనక్కర్లేదు. అక్బరుద్దీన్ ఓవైసీ కూడా అల్లు అర్జున్ మీద ఫైర్ అయ్యారు. ఇక అల్లు అర్జున్ సినిమా సమయంలో మహిళ తొక్కిసలాటలో మృతి చెందడంతో తెలంగాణ గవర్నమెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇకపై బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నామని, అలాగే టికెట్ రేట్లు కూడా పెంచమని ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి అంటూ ఒక సంచలన నిర్ణయం తీసుకోవడంతో మిగతా హీరోలకు ఇబ్బందిగా మారింది.ఇక ఈ విషయాన్ని తెలంగాణ గవర్నమెంట్ చెప్పడంతోనే చాలామంది హీరోల ఫ్యాన్స్ అసహనానికి గురయ్యారు. ఒక్క బన్నీ చేసిన తప్పు వల్ల మిగతా హీరోలు అందరూ సఫర్ అవ్వాలా.. టాలీవుడ్ ఇండస్ట్రీ అల్లు అర్జున్ వల్ల ఇబ్బందులు పడుతోంది. ఒక్కడి వల్ల ఇండస్ట్రీ మొత్తం సఫర్ అవ్వాలా అంటూ మిగతా హీరోల ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై మండిపడుతున్నారు. అంతే కాదు అల్లు అర్జున్ చేసిన తప్పు వల్ల ఒక మహిళ ప్రాణం పోవడమే కాదు మిగతా హీరోలకు సినిమాలకు కూడా పెద్ద నష్టం వచ్చి పడింది. ఇప్పుడు విడుదలయ్యే స్టార్ హీరోల సినిమాలు కలెక్షన్లు వసూలు చేయడానికి టికెట్ రేట్లు పెంచకపోవడంతో సినిమా తీసిన నిర్మాతలకు పెద్ద నష్టం వస్తుంది.

అలాగే ఇప్పుడు రాబోయే కొత్త సినిమాలు అంతకుముందు ఉన్న సినిమా రికార్డులను బద్దలు కొట్టడం కూడా కష్టమే.అలా అల్లు అర్జున్ చేసిన తప్పు వల్ల మిగతా హీరోలు ఇబ్బంది పడుతున్నారు.అల్లు అర్జున్ ని ఇండస్ట్రీ నుండి బాయ్ కట్ చేయండి ఆయన్ని బ్యాన్ చేయండి అంటూ కొంతమంది హీరోల అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కానీ అల్లు ఫ్యాన్స్ మాత్రం అల్లు అర్జున్ కావాలని ఏమీ చేయలేదు. ఏదో అలా యాక్సిడెంటల్ గా జరిగిపోయింది.  మా హీరో సినిమా విడుదలైనప్పుడు చనిపోతే నేరం మొత్తం ఆయన మీదకే తోసేస్తున్నారు. మిగతా హీరోల సినిమాలు రిలీజ్ అయిన సమయంలో కూడా ఏదో ఒక విషయంలో కొంతమంది అభిమానులు మరణించారు మరి ఆ హీరోలకు ఏ శిక్ష వేయాలి అంటూ అల్లు ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: