స్టార్ హీరో అల్లు అర్జున్ కు ఇలాంటి పరిస్థితి ఎదురు కావడానికి కారణమేంటనే ప్రశ్నకు ఎక్కువమంది చెబుతున్న సమాధానం ఆటిట్యూడ్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ తన ఆటిట్యూడ్ తో తనకు మేలు చేసేవాళ్లను సైతం దూరం చేసుకుంటున్నాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అల్లు అర్జున్ తన వాళ్లు ఎవరో పరాయి వాళ్లు ఎవరో తెలుసుకోలేకపోతున్నారని అందుకే ఇలాంటి పరిస్థితి ఎదురవుతోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
మెగా ఫ్యామిలీకి దూరం కావడం బన్నీ చేసిన అతిపెద్ద తప్పులలో ఒకటి అని చెప్పడంలో సందేహం అవసరం లేదు. బన్నీ ఫ్యాన్స్ సైతం ఆటిట్యూడ్ తగ్గించుకో బన్నీ అంటూ అల్లు అర్జున్ కు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అల్లు అర్జున్ ఈ విషయంలో మారకపోతే కెరీర్ పరంగా ఎంత ఎదిగినా తీవ్ర స్థాయిలో నష్టపోక తప్పదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
మరి ఇప్పటికైనా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇస్తున్న సలహాలను, సూచనలను పాటిస్తారేమో చూడాల్సి ఉంది. బన్నీ రేవంత్ రెడ్డి చెప్పిన విషయాలను కౌంటర్లు ఇవ్వడం బాగానే ఉంది కానీ పోలీసులదే తప్పనేలా వ్యవహరించడం ఎంతవరకు రైట్ అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ వివాదం విషయంలో పోలీసుల వెర్షన్ ఏ విధంగా ఉండనుందనే చర్చ సైతం జోరుగా జరుగుతోంది.
 
వివాదం కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో బన్నీ సైతం ప్రెస్ మీట్లకు కొంతకాలం పాటు దూరంగా ఉంటే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో బన్నీ మారక తప్పదని సోషల్ మీడియా వేదికగా వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ వివాదం విషయంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. బన్నీ క్రేజ్ మాత్రం మామూలుగా లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదాల వల్ల అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు సైతం తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని తెలుస్తోంది. మెగా హీరోలు జోక్యం చేసుకుంటే ఈ పరిస్థితి కొంతమేర మారే ఛాన్స్ అయితే ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: