అల్లు అర్జున్ ని చూడడానికి సంధ్యా థియేటర్ వద్దకు ఎక్కువ జనాలు రావడంతో ఆ క్రౌడ్ ని కంట్రోల్ చేయలేక జనాలు తొక్కుకున్నారు. ఈ క్రమంలోనే రేవతి అనే మహిళ మృతి చెందింది . ఇది చాలా చాలా బాధాకరం . తెలంగాణ పోలీసులు బన్నీని అరెస్ట్ చేశారు . ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే అల్లు అర్జున్ ని ఏకిపారేసే విధంగా మాట్లాడేశారు. దీంతో ఈ ఇష్యూ మరింత హిట్ పెంచేసింది . అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ తన వర్షన్ ని తను వినిపించాడు. నేను ఏ తప్పు చేయలేదు అని ..నేషనల్ మీడియా స్థాయిలో నా క్యారెక్టర్ దెబ్బతీసేలా చూస్తున్నారు అంటూ లభోదిభో అని తన మాటలను తనకి జరిగిన అన్యాయాని.. తను ఫేస్ చేసిన సిచువేషన్ ని బయటపెట్టాడు .
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో చాలా సేపు మాట్లాడాడు . అయినా సరే ఎక్కడ కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్న పేరు మాత్రం అస్సలు మాట్లాడలేదు. అసలు ఈ ఇష్యూ అంతా సీఎం రేవంత్ రెడ్డి కారణంగానే అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. ఈ మూమెంట్లో అల్లు అర్జున్ ఆ పేరు ఒక్కసారి ఎత్తలేదు . తెలంగాణ గవర్నమెంట్ మాకు ఫేవర్ చేసింది అంటున్నాడు ..కానీ సీఎం రేవంత్ రెడ్డి టికెట్స్ పెంచి.. బెనిఫిట్ షో లకి పర్మీషన్ ఇచ్చారు అన్న విషయాన్ని మాత్రం ఎక్కడా పేరు పెట్టి ప్రస్తావించలేదు. దీంతో అల్లు అర్జున్ - రేవంత్ రెడ్డి ల మధ్య వార్ పీక్స్ కి చేరుకునే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు సినీ విశ్లేషకులు. అంతేకాదు మీడియా ప్రతినిధులు పదేపదే సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్న సరే అల్లు అర్జున్ కానీ అల్లు అరవింద్ కానీ స్పందించలేదు. బహుశా బెయిల్ మీద ఉన్నాడుగా ఇలా మాట్లాడితే ఏదైనా ఇష్యూస్ అవుతుంది అన్న కారణంగా మాట్లాడలేదు ఏమో..? లేకపోతే ఎందుకులే ఈ తలనొప్పి మళ్లీ జైల్లోకి వేస్తాడేమో ..? అన్న భయం కారణంగా మాట్లాడలేదో.. అల్లు అర్జున్ కే తెలియాలి. కానీ రేవంత్ రెడ్డిని చూసి మాత్రం అల్లు అర్జున్ భయపడ్డాడు అంటూ చాలామంది జనాలు మాట్లాడుకుంటున్నారు..!