ఇక ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌పై బీఎన్‌ఎస్ 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చిన సమయంలో భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోనందుకు థియేటర్ యాజమాన్యంపై కూడా కేసు నమోదైంది. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఆయనను కలవడానికి చాలా మంది వచ్చి వెళ్లడం జరిగింది. ఈ క్రమంలో సంధ్య థియేటర్ ఘటనపై అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ఓ సినీనటుడిని అరెస్ట్ చేస్తే ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ తప్పు ఉందని.. అందుకే అతను బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. జరిగిన ఘటనలో అల్లు అర్జున్ కి కన్ను పోలేదు.. కాలు పోలేదు ఎలాంటి గాయం కాలేదని, ఎందుకు అందరూ వెళ్లి పరామర్శించడం అని ఫైర్ అయ్యారు. శ్రీ తేజ్ కన్న తల్లిని పోగొట్టుకున్నాడని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ఒక్కరైనా సహాయం చేశారా.. పోనీ వెళ్లి చూశారా అంటూ మండిపడ్డారు.