తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది . దీనితో అల్లు అర్జున్ పై కేసు నమోదు అయింది . తెలంగాణ పోలీసులు బన్నీని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు . నాంపల్లి కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధిస్తే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చి అల్లు అర్జున్ ని సేఫ్గా బయటికి పంపించేసింది . ఈ వివాదం ఇక్కడితో సర్దుమనిగిపోయింది అనుకుంటున్నా మూమెంట్లో అసెంబ్లీలో అల్లు అర్జున్ ప్రస్తావన తీసుకొచ్చి సంచలనానికి తెరలేపాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి . అయితే ఇదే మూమెంట్లో అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టారు . అల్లు అర్జున్ కూడా తన బాధను తను చెప్పుకున్నాడు.
కాగా ఇలాంటి మూమెంట్ లోనే సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక వీడియో ట్రెండ్ అవుతుంది. ఎన్టీఆర్ గతంలో ఓ సినిమా ప్రమోషన్స్ భాగంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "ఫాన్స్ ఎంత సేఫ్ గా ఇక్కడికి వచ్చారో అంతే సేఫ్ గా ఇంటికి వెళ్ళాలి అని.. మీకోసం ఇంటి దగ్గర మీ అమ్మానాన్నలు ఎదురు చూస్తూ ఉంటారు అని .. మీకు ఏదైనా జరిగితే బాధపడే వాళ్ళలో మీ అమ్మానాన్నలతో పాటు నేను కూడా ఉంటాను అని.. దయచేసి ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయకండి అని.. అభిమానం అనేది హద్దుల్లోనే ఉండాలి అని ..ప్రాణాల మీదకు తెచ్చుకునే అంత ఉండకూడదు "అని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు . ప్రజెంట్ ఇదే వీడియోని ట్రెండ్ చేస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. అల్లు అర్జున్ కూడా ఈ విధంగా ఆలోచిస్తే బాగుండేది ఏమో అంటూ సెటైరికల్ గా అల్లు అర్జున్ చేసింది తప్పు అంటూ మాట్లాడుతున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఎన్టీఆర్ వీడియో హీట్ పెంచేస్తుంది..!