మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ కావాలని ఈ విధంగా సంధ్యా థియేటర్ వద్ద బయటకు వచ్చి రోడ్ షో చేశారు అంటూ తెలంగాణ సీఎం మాట్లాడడం సంచలనంగా మారింది. అంతేకాదు అసెంబ్లీలో ఒక పాన్ స్థాయిలో పేరు సంపాదించుకున్న హీరో పై ఇలాంటి కామెంట్స్ చేయడం అందరికీ ఆశ్చర్యకరంగా కూడా అనిపించింది . నిజానికి బన్నీ చాలా సైలెంట్ అయిపోయాడు . అల్లు అర్జున్ అరెస్ట్ తో చాలా కృంగిపోయాడు. గత 15 రోజుల నుంచి ఇంటి గార్డెన్ లో చాలా దిగులుగా కూర్చుని ఉన్నాను అంటూ ఆయనే స్వయంగా చెప్పాడు .
అయితే అల్లు అర్జున్ పై ఇలా లేనిపోని నిందలు వేస్తూ క్యారెక్టర్ దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు అంటూ అల్లు అరవింద్ సైతం చాలా బాధపడిపోయారు . ఇదే క్రమంలో అసలు బన్నీకి ఇష్టం లేకపోయినా ప్రెస్ మీట్ పెట్టించింది మాత్రం సుకుమార్ అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది. బన్నీ అంటే సుకుమార్ కి ఎంత ఇష్టం అనే విషయం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . చాలా చాలా జాన్ జిగిడి దోస్తులు .. బన్నీ జైలుకు వెళ్తే సుకుమార్ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు.
తన సినిమా కారణంగానే ఇదంతా జరిగింది అంటూ సుకుమార్ చాలా బాధపడిపోయారట . బన్నీ పై ఇలా తప్పుడు నిందలు వేస్తూ ఉండడంతో ఇంకా సైలెంట్ గా ఉంటే పరిస్ధితిలు చాలా చాలా దారుణంగా మారిపోతాయి బన్నీ ప్రెస్ మీట్ పెట్టాల్సిందే అంటూ బెయిల్ పై ఉన్న బన్నీను ప్రెస్ మీట్ పెట్టేలా చేశాడట సుకుమార్ . అంతేకాదు వెనక ఉండి తన బ్యాక్ గ్రౌండ్ తో అంతా కూడా నడిపిస్తున్నాడట . మెగాస్టార్ చిరంజీవి - బన్నీ కలవడానికి కారణం కూడా సుకుమార్ అంటూ బయటికి వచ్చింది..!