70 ఏళ్ల వయస్సులో కూడా ఆయన ఉత్సాహం యువ హీరోలకు పోటీనిస్తోంది. కొత్తదనానికి ఎప్పుడూ స్వాగతం పలికే చిరంజీవి, నేటి ట్రెండ్స్‌కు తగ్గట్లుగా తనను తాను మలుచుకుంటూ, సవాల్‌తో కూడుకున్న పాత్రలను ఎంచుకుంటూ విజయాలు సాధిస్తున్నారు. అందుకే నేటి యువ దర్శకులు కూడా ఆయనతో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు. సాధారణంగా ఓల్డ్ అయిపోయిన హీరోలను సోలోగా పెట్టే సినిమాలు తీసే ధైర్యం ఎవరూ చేయలేరు కానీ మెగాస్టార్ కి ఇప్పటికీ తగ్గని క్రేజ్, ఆయన స్టామినా కారణంగా యువ హీరోల కంటే ఎక్కువ అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాడు. యువ హీరోలతో సినిమాలు తగ్గించుకోవడం చిరుకే చెల్లింది. అది ఆయన నెలకొల్పిన ఒక అరుదైన రికార్డింగ్ చెప్పుకోవచ్చు.
హై బడ్జెట్ చిత్రాల్లో నటిస్తూ, సరికొత్త రికార్డులు సృష్టిస్తూ, టాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు. ఇది నిజంగా భారతీయ సినిమా చరిత్రలో ఒక అరుదైన విషయం. నిజం చెప్పాలంటే మెగాస్టార్ కేవలం నటుడు కాదు... ఒక శకం! ఆయన రాకతో తెలుగు సినిమా ఖ్యాతి భారతదేశవ్యాప్తంగా వ్యాపించింది. తరాలు మారినా, చిరు స్ఫూర్తి చెక్కుచెదరదు. ఆయన సృష్టించిన చరిత్రను తిరగరాసే సాహసం ఎవరూ చేయలేరు. భారీ అంచనాలతో ఆయన తదుపరి చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పాన్-ఇండియా స్టార్‌డమ్‌ను దాటి, మెగాస్టార్ అనే పదానికి కొత్త నిర్వచనం ఇవ్వాలని ఆయన తపిస్తున్నారు. కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది. కానీ, ఆయన పట్టుదల, ముందుచూపు అమోఘం.