ఈ సినిమా సాధించిన కలెక్షన్ల రికార్డుల గురించి తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ చిన్న సినిమాగా విడుదలైనా పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. విశ్వక్ సేన్ గామి చిన్న సినిమాగా రిలీజ్ అయినప్పటికీ కలెక్షన్ల విషయంలో మాత్రం అదరగొట్టిందనే చెప్పాలి. విశ్వక్ సేన్ కెరీర్ బెస్ట్ సినిమాల్లో ఈ సినిమా ఒకటిగా నిలిచింది. శ్రీవిష్ణు ఓం భీమ్ బుష్ కూడా కమర్షియల్ గా హిట్ గా నిలిచింది.
ఈ ఏడాది సెకండాఫ్ లో విడుదలైన కమిటీ కుర్రోళ్లు, ఆయ్, 35 చిన్న కథ కాదు, మత్తు వదలరా2 కలెక్షన్ల విషయంలో అదరగొట్టాయి. ప్రేక్షకులు సైతం ప్రస్తుతం కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం. మంచి సినిమాలకు ఓటీటీలలో సైతం మంచి రెస్పాన్స్ వస్తోంది. చిన్న సినిమాలు పెద్ద విజయాలను సొంతం చేసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.
భారీ బడ్జెట్లతో సినిమాలను తెరకెక్కించి సినిమాలకు ఫ్లాప్ టాక్ వస్తే నిర్మాతలు తీవ్రస్థాయిలో నష్టపోయే అవకాశం అయితే ఉంది. 2024 సంవత్సరంలో భారీ లాభాలను అందించిన చిన్న సినిమాలు నిర్మాతలకు సైతం ఎంతో సంతోషాన్ని కలిగించాయని చెప్పడంలో సందేహం అయితే అవసరం లేదు. 2025 సంవత్సరంలో కూడా చిన్న సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకోవాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని చిన్న సినిమాలు సాధించిన విజయాలు ప్రేక్షకులకు సైతం ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి.