ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప పార్ట్ 2 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి రష్మిక మందన హీరోయిన్గా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 5 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ సినిమా ఇప్పటికే అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి అనేక రికార్డులను సృష్టించింది. కొంత కాలం క్రితం యాష్ హీరోగా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కే జి ఎఫ్ చాప్టర్ 2 అనే మూవీ వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఇకపోతే ఈ సినిమా 1200 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా బుక్ మై షో లో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ మూవీ బుక్ మై షో లో 17.1 మిలియన్ టికెట్ సేల్స్ సొంతం చేసుకుని అదిరిపోయే రేంజ్ రికార్డును సొంతం చేసుకుంది. ఇకపోతే తాజాగా పుష్ప పార్ట్ 2 మూవీసినిమా రికార్డును క్రాస్ చేసింది. పుష్ప 2 మూవీ విడుదల అయ్యి ఇప్పటివరకు 17 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ చేసుకుంది.

కేవలం 17 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమా 17.27 మిలియన్ టికెట్ సేల్స్ ను బుక్ మై షో లో సాధించి కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ పై ఉన్న రికార్డును క్రాస్ చేసింది. ఇకపోతే ఈ మూవీ కి ఇప్పటికి కూడా అద్భుతమైన కలెక్షన్లు వస్తున్నాయి. దానితో ఈ మూవీ మరికొన్ని రోజుల పాటు సూపర్ లేడు టికెట్ సేల్స్ ను బుక్ మై షోలో సాధించే అవకాశాలు ఉన్నాయి. పుష్ప పార్ట్ 2 మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ... మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: