డైరెక్టర్ రాంగోపాల్ వర్మ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం శారీ. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గిరి కృష్ణ కమల్ డైరెక్షన్లో తెరకెక్కిస్తూ ఉన్నారు.. సోషల్ మీడియాలో కేవలం ఒక్క వీడియో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఆరాధ్య దేవి ఇందులో హీరోయిన్ గా నటిస్తూ ఉన్నది. అలాగే సత్య మధు కూడా కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు .ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. నిన్నటి రోజున వరల్డ్ శారీ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి వర్మ సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేయడం జరిగింది.



ఈ మేరకు తన ట్విట్టర్ నుంచి హ్యాపీ వరల్డ్ శారీ డే సారీ నుంచి గర్ల్ సాంగ్ రిలీజ్ అంటు తెలియజేశారు వర్మ. ఈ పాటలో ఆరాధ్య అంద చందాలతో కుర్రాళ్లను సైతం మతులు పోగొట్టేలా చేస్తోంది.2: 35 నిడివి ఉన్న ఈ సాంగులో ఆరాధ్య అందాలు కనులవిందుగా చూపించారు డైరెక్టర్ గిరి కృష్ణ.. శారీలో ఆరాధ్య మరింత అందంగా కనిపిస్తోందని అభిమానులు నేటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఒక్కో ఫోటోలో స్టిల్స్ కూడా మరింత హైలెట్ గా కనిపిస్తున్నాయి.



ఈ పాటలో ఆరాధ్య నడుము అందాలతో పాటు తన అందాలను హైలెట్ చేశారు డైరెక్టర్ గిరి కృష్ణ.. మొత్తానికి ఈ పాటతో మరింత హైటెక్కించుకున్నారు వర్మ. ఈ సినిమా జనవరి 30వ తేదీన రిలీజ్ కాబోతోంది అంటూ వర్మ తెలియజేశారు. ఈ చిత్రంలోని పాట హీరోయిన్ ని లవ్ చేస్తున్న అబ్బాయి ఈ సినిమాలో పాడుతున్నట్లుగా చూపించారు. అంతేకాకుండా ఈ సాంగ్లో హీరోయిన్ ఆరాధ్య చీరలు అందాలతో సైతం హీట్ పుట్టించేలా కనిపిస్తున్నది. ఏ మేరకు ఈమె అందచందాలు శారీ సినిమాకు  ప్లస్ అవుతుందా చూడాలి మరి. ఆరాధ్యకు రాబోయే రోజుల్లో అవకాశాలు మరిన్ని రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: