కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న మోహన్ బాబు రీసెంట్ గా ఒక పెద్ద వివాదంలో ఇరుక్కున్న సంగతి మనకు తెలిసిందే. ముఖ్యంగా ఇంట్లో ఉన్న గొడవలు వీధికి వచ్చి ఆయన పరువు మొత్తం బజారున పడింది. అలాగే ఈ గొడవల్లో భాగంగా జర్నలిస్టుపై మోహన్ బాబు చేయి చేసుకోవడం ఇలా ఎన్నో జరిగిపోయాయి. అయితే ఇదంతా పక్కన పెడితే మోహన్ బాబు ఇప్పటికే ఇండస్ట్రీలో ఎన్నో వివాదాల్లో ఇరుక్కున్నారు. కానీ ఇప్పుడు జరిగిన వివాదం మాత్రం చాలా పెద్దది అని చెప్పుకోవచ్చు. అయితే మోహన్ బాబు ఒక డైరెక్టర్ ని తన కొడుకు విష్ణు కోసం షూటింగ్లోనే తెగ టార్చర్ చేశారట.మరి ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు..మోహన్ బాబు ఏం టార్చర్ చేశారు అనేది చూద్దాం. దర్శకధీరుడు రాజమౌళితో మోహన్ బాబు చేసిన సినిమా యమదొంగ.. 

ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్ర అయినటువంటి యముడు పాత్రలో నటించారు. ఈ సినిమాలో పాత సినిమాల్లో యముడిగా కైకాల సత్యనారాయణ ఎలా అయితే సెట్ అయ్యారో మోహన్ బాబు కూడా అంతే బాగా యముడి పాత్రకి సెట్ అయ్యారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో రాజమౌళి పదేపదే ఓ విషయంలో ఇబ్బంది పెట్టారట.అదేంటంటే.. విష్ణు తో రాజమౌళిని ఓ సినిమా చేయమని తన కొడుకు కోసం ఒక మంచి స్టోరీ ని రెడీ చేయమని మోహన్ బాబు యమదొంగ షూటింగ్ సెట్లో రాజమౌళి అడిగారట.

అయితే రాజమౌళి ఓకే చేద్దాం అని మాట ఇచ్చారట. కానీ మోహన్ బాబు మాత్రం షూటింగ్ స్పాట్ లో పదే పదే నా కొడుకుతో సినిమా ఎప్పుడు చేస్తారు.సినిమా కథ రెడీ చేశారా అంటూ టార్చర్ చేశారట. ఇక ఈ టార్చర్ కి రాజమౌళికి మోహన్ బాబు కి మధ్య చిన్నపాటి మనస్పర్ధలు కూడా తలెత్తాయట.దాంతో కోపంతో మోహన్ బాబు నీ కొడుకుతో సినిమా చేయనని చెప్పేసారట.అందుకే యమదొంగ సినిమాలో వీరి కాంబినేషన్ బాగా సెట్ అయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన ఏ సినిమాలో కూడా మోహన్ బాబుని రాజమౌళి తీసుకోలేదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: