పైకి ఎంతో ఆర్డినరీగా కనిపిస్తాడు కానీ లోపల మాత్రం ఎన్టీఆర్ ఎక్స్‌ట్రార్డినరీ .. ఆయన ప్లానింగ్ మామూలుగా ఉండదు .. టాలీవుడ్ లో మరి ఏ హీరో కు సాధ్యం గాని రేంజ్ లో ఎన్టీఆర్ ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నాడు . అది గాని ఆయన అనుకున్నట్టు వర్కౌట్ అయిందో .. దెబ్బకు ప్రభాస్ కంటే పైన కూర్చుంటాడు యంగ్ టైగర్ .. మరి ఆ స్థాయిలో ఎన్టీఆర్ ఏం ప్లాన్ చేస్తున్నారు ? ఇంత‌కి ఆయన ఏం చేస్తున్నారో ఇక్కడ చూద్దాం.


దేవర బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ కాన్ఫిడెన్స్ మామూలుగా లేదు .. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఎన్టీఆర్ కి కొత్త క‌కాపోవచ్చు కానీ రాజమౌళి సినిమా తర్వాత హిట్ కొట్టడం మనేది మామూలు విషయం కాదు . అది దేవరతో జరిగింది .. ఇదే కిక్కులో ఉంటూనే ఫ్యూచర్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో సిద్ధం చేస్తున్నాడు. వాటిలో భాగంగానే అన్ని భాషల దర్శకులను తన దగ్గర అసెంబుల్ చేసుకుంటున్నాడు. ఆర్ ఆర్ ఆర్‌ తో పాన్ ఇండియా హీరోగా మారాక అన్ని భాషల దర్శ‌కులను కవర్ చేస్తున్నాడు..


కొరటాలతో దేవర చేశాడు .. ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీతో వార్ 2 చేస్తున్నాడు. ఈ సినిమాతో నేరుగా బాలీవుడ్ ను పలకరించబోతున్నాడు .. వీటి తర్వాత కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయబోతున్నాడు .. వీరి తర్వాత కోలీవుడ్ నుంచి నెల్సన్ , అట్లీ , వెట్రి మారన్ వంటి దర్శకులతో ఎప్పటినుంచో ఎన్టీఆర్ చర్చలు జరుపుతున్నాడు. ప్రస్తుతం జైలర్ 2 పనుల్లో బిజీగా ఉన్నాడు నెల్సన్ .. ఈ లోపు వార్ 2 తో పాటు ప్రశాంత్ నీల్ సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నాడు మ్యాన్ ఆఫ్ మాస‌స్‌. అన్ని అనుకున్నట్టు కుదిరితే 2026 లో తమిళ దర్శకుడు తో ఎన్టీఆర్ కాంబో కన్ఫామ్ అవ్వచ్చు .. ఇలా మొత్తానికి భాషతో సంబంధం లేకుండా అగ్ర దర్శకులు అందరినీ ఒకే లైన్లోకి తీసుకువస్తున్నాడు ఎన్టీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: