ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా బాలకృష్ణ సరసన నటించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఇందులోని పాటలు, ట్రైలర్లు కూడా ఆకట్టుకున్నాయి తమన్ సంగీతం విశేషంగా మెప్పించింది. అయితే ఈ మూవీలో టైటిల్ రోల్ కోసం మొదటగా బాలకృష్ణను అనుకోలేదట. బాబీ మొదటగా ఇందులో హీరోగా సూపర్ స్టార్ రజినీకాంత్ ను నటింప చేయాలని చాలా ప్రయత్నించారట కానీ రజనీకాంత్ మూవీ అంతా బాగుంది కానీ నాకు గుర్రపు స్వారీ చేయడం రాదు, దీన్ని మరో యంగ్ హీరో చేత తీస్తే బాగుంటుందని సలహా ఇచ్చారట. ఈ మూవీలో గుర్రపు స్వారీ అనేది కీలకంగా, అలానే ఇది ఒక ఫిజికల్లీ డిమాండింగ్ రోల్. దీన్ని రజనీకాంత్ చేయలేరని నిర్ధారించుకున్నాక అలాంటి మరో క్రేజ్, యాక్టింగ్ స్కిల్స్ ఉన్న హీరో కోసం వెతికారు. అప్పుడే ఆయన బాలకృష్ణ చేసిన అఖండ సినిమా చూడటం జరిగింది. అందులో బాలయ్య ఇరగదీసాడు కదా, ఇంకేముంది వెంటనే బాబి తన సినిమాకి బాలయ్య కరెక్ట్ అని అప్రోచ్ అవ్వడం జరిగింది. సినిమా కథ బాగా ఉండటంతో ఈ నరసింహుడు మరో మాట అనకుండా సైన్ చేశారని సమాచారం.
ఈ మూవీలో ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలతో పాటు కళ్ల వెంట నీళ్లు తెప్పించే ఎమోషనల్ సీన్లు కూడా ఎక్కువగానే ఉంటాయని తెలుస్తోంది. నెవర్ సీన్ బిఫోర్ లుక్ లో బాలయ్య బాబు ఇందులో కనపడతారని ప్రమోషనల్ కంటెంట్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో పెద్ద హిట్ అయితే రజనీకాంత్ తప్పకుండా అవకాశం ఉంటుంది. గుర్రపు స్వారీ ఒక్కటి నేర్చుకుని ఈ మూవీ తానే చేసి ఉంటే బాగుండు అని ఆయన ఫీల్ అవ్వచ్చు. చూడాలి మరి బాలయ్య బాబు ఇది ఎంత పెద్ద హిట్ తెచ్చి పెడుతుందో.