సినిమా ఇండస్ట్రీ లో ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టుగా నటించి ఆ తర్వాత హీరోలుగా మారిన వారు ఉన్నారు. ఇక కొంత మంది చైల్డ్ ఆర్టిస్టుగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారు కూడా ఉన్నారు. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం విక్టరీ వెంకటేష్ హీరోగా మీనా హీరోయిన్గా సూర్యవంశం అనే సినిమా వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో వెంకటేష్ రెండు పాత్రలలో నటించాడు. వెంకటేష్ ఈ సినిమాలో ఒక పాత్రలో తండ్రిగా నటించగా , మరొక పాత్రలో కొడుకుగా నటించాడు. ఇక ఈ సినిమాలో వెంకటేష్ రెండు పాత్రలలో తనదైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.

సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా వెంకటేష్ , మీనా ఇద్దరికీ కి కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో కొడుకు పాత్రలో నటించిన వెంకటేష్ కి ఒక కుమారుడు ఉంటాడు. ఇక సూర్యవంశం సినిమాలో తండ్రి వెంకటేష్ పాత్రకు వెంకటేష్ కుమారుడి పాత్రకు మధ్య కొన్ని సన్నివేశాలు ఉంటాయి. ఇవి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీ లో చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలో నటించిన పిల్లాడికి మంచి గుర్తింపు వచ్చింది. ఆయన అసలు పేరు ఆనంద్ హర్షవర్ధన్. ఈయన సూర్యవంశం సినిమా మాత్రమే కాకుండా చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు.

ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన హీరో గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఆనంద్ హర్షవర్ధన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ హల్చల్ చేస్తున్నాడు. మరి హీరో గా ఈయన ఏ స్థాయిలో సక్సెస్ అవుతాడో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: