- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

తెలుగు చిత్ర పరిశ్రమ కు ఎంతో మంది హీరోయిన్లు వస్తున్నారు .. అలా మాయపోతున్నారు .. అయితే వారిలో కొందరు చేసేవి తక్కువ సినిమాలు అయిన అప్పటికీ తమ మార్క్ నటన తో ప్రేక్షకుల మనసులో గుర్తుండిపోతున్నారు .. అలాంటి ముద్దుగుమ్మల్లో ఇప్పుడు చెప్పే హీరోయిన్ కూడా ఒకరు . ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా ? తెలుగులో ఈ బ్యూటీ నటించింది అతి తక్కువ సినిమాలు అయినా ప్రేక్షకులను తన అందంతో అభినయంతో మైమరిపింప చేసింది .. ప్రస్తుతం సినిమాలుకు దూరంగా ఉంటుంది ఈ వయ్యారి భామ .. ఇంత‌కు ఈ హీరోయిన్ ఎవరంటే ..


యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జంటగా నటించిన ఈ బ్యూటీ మరెవరో కాదు .. మంజరీ ఫడ్నిస్ .. అల్లరి నరేష్ తో సిద్దు ఫ్రొం శ్రీకాకుళం అనే సినిమా ద్వారా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది .. ఇక సినిమాలో హద్దులు లేని అందాల ఆరబోత వలకబోసి కుర్రాళ్ళ గుండెల్లో మంటలు రేపింది . ఇక ఈ సినిమా తర్వాత దర్శకుడు కే విశ్వనాథ్ తెరి కెక్కించిన శుభప్రదం అనే సినిమాల్లో కూడా నటించింది . ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్‌ అవ్వకపోయినా మంజరీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత యంగ్ టైగ‌ర్‌ ఎన్టీఆర్ కు జంటగా శక్తి సినిమాలో నటించింది.


హిందీ మరాఠీ భాషల్లో పలు సినిమాల్లో నటించడమే కాకుండా వెబ్ సిరీస్ లోను ముద్దుగుమ్మ మెరిసింది .. అలాగే కొన్ని హిట్ సినిమాలను కూడా తన ఖాతాలో వేసుకుంది .. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ హద్దు మీరి త‌న‌ అందాలతో మతులు పోగొడుతుంది . బికినీ  హాట్ షో తో సోషల్ మీడియాలోనే మంటలు పుట్టిస్తుంది ఈ ముద్దుగుమ్మ .



మరింత సమాచారం తెలుసుకోండి: