గత సంవత్సరం బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన గాదర్ 2.. ఈ సినిమాలో సన్నీడియోల్, అమీషా పటేల్ ప్రధాన పాత్రలో నటించగా అనిల్ శర్మ దర్శకత్వం వహించారు .. తాజాగా ఈ సినిమా దర్శకుడు హీరోయిన్ ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకున్నారు .. హీరోయిన్ అమీషా పటేల్ వరుస పోస్టులతో దాడికి దిగింది. ఇక దాంతో ఒక్కసారిగా బాలీవుడ్ లో వాతావరణం వేడెక్కింది. గాదర్ ఏ ప్రేమ్ కథ సిక్వల్ గా తెర్కక్కిన గాదర్ 2 సినిమాలో ముందుగా అమీషా పటేల్ ని అత్త పాత్రకి అడిగారట దర్శకుడు అనిల్..
ఇక ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుతూ అత్త పాత్ర చేయడానికి అమీషా ఒప్పుకోలేదు .. నర్గీస్ దత్ వంటి గొప్ప నటీమణులు కూడా చిన్న వయసులోనే అత్త పాత్రలు చేశారని ఎంతో నచ్చజెప్ప అయిన ఆమె మాత్రం చేయనని చెప్పేసిందని ఆయన అన్నారు. ఇక దీంతో ఇంటర్వ్యూ వైరల్ కావడం తో అమీషా దానిపై స్పందిస్తూ .. డియర్ డైరెక్టర్ ఇది కేవలం సినిమా మాత్రమే నిజ జీవితం లో ఒక కుటుంబానికి సంబంధించిన విషయం కాదు .. అక్కడ ఏం చేయాలి ఏం చేయకూడదు .. అనేది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం పై ఆధారపడి ఉంటుంది ..
మీరంటే నాకు ఎంతో గౌరవం గాదర్ కోసమే కాదు ఏ సినిమా కోసమైనా నేను అత్త పాత్రలు చేయను .. 100 కోట్లు ఇచ్చిన ఆ పాత్ర చేయడానికి నేను అంగీకరించిను అంటూ ఘాటుగా స్పందించింది. దీనికన్నా ముందు కూడా ఇంటర్నెట్లో వీరిద్దరూ తిట్టుకున్నారు .. గాదర్ 2 సినిమాలో ఆయన కొడుకు ఉత్కర్ష్ శర్మ పాత్రని హైలెట్ చేయడం కోసం సినిమా క్లైమాక్స్ ని మార్చేశారని ఆరోపించింది .. అలాగే గాదర్ 2 సినిమాని 60 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా బాక్స్ ఆఫీస్ దగ్గర 600 కోట్లు రాబట్టిందని త్వరలోనే గాదర్ 3 కూడా సెట్స్ పైకి వెళ్ళనుంది.