అల్లు అర్జున్ .. ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా హ్యూజ్ రేంజ్ లో ట్రోల్లింగ్ కి గురవుతుంది . అది ఎందుకో కూడా మనందరికీ తెలిసిందే. పుష్ప 2 సినిమా చూడడానికి బన్నీ సంధ్యా థియేటర్ కి రావడం..అక్కడ అల్లు అర్జున్ ని చూడడానికి జనాలు ఏగబడిపోవడం ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఫ్యాన్ అయిన రేవతి మృతి చెందడం జరిగింది . దీంతో ఇది అల్లు అర్జున్ కెరీర్ కు మాయని మచ్చగా మిగిలిపోయింది . అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు కుటుంబ సభ్యులు . అంతేకాదు అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్ట్ 14 రోజుల రిమాండ్ కూడా విధించింది . కానీ ఆయన తన పలుకుబడితో మధ్యాంతర బెయిల్ తెచ్చుకొని సేఫ్ గా బయటపడ్డాడు.


అంతా కూల్ అయిపోతుంది అనుకున్న మూమెంట్లో అల్లు అర్జున్ పేరుని అసెంబ్లీలో ప్రస్తావిస్తూ టాపిక్ ను లేవదీశాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి . ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అయితే ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ కేవలం తన వర్షన్ మాత్రమే వినిపించాడు. రిపోర్టర్స్ నుంచి ఏదైనా ప్రశ్న ఎదురైన ఒక్కటంటే ఒక్కటి కూడా ఆన్సర్ ఇవ్వలేదు. అంతేకాదు "నేను మీడియా క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇస్తే అది లీగల్ ఇష్యూ అవుతుందేమో ..?"అంటూ భయపడి పోయి నమస్తే అంటూ వెళ్లిపోయాడు . ఆ తర్వాత అల్లు అరవింద్ ని ప్రశ్నించారు మీడియా రిపోర్టర్స్ .



అయితే అల్లు అర్జున్ కూడా పెద్దగా ఏమీ స్పందించలేదు. ఏమీ మాట్లాడలేదు . కానీ ఆయన నమస్తే చెప్పి వెళ్ళిపోతున్న మూమెంట్లో అల్లు అరవింద్ ను రిపోర్టర్స్ సీఎం రేవంత్ రెడ్డి గురించి ప్రశ్నించారు.. మీరు మూడు తరాలు హీరోలు అంటున్నారు ..మరి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పాన్ ఇండియా హీరో గురించి  పేరు ప్రస్తావించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించారు ..? అయినా ఏమీ మాట్లాడలేదు . చాలా కోపంగా చూస్తున్నట్లే కళ్ళు ఉరిమినట్లు ఉరిమి మౌనంగా వెళ్లిపోయారు. ఆ ఎక్స్ప్రెషన్స్ చూసిన ఎవరికైనా అర్థమైపోతుంది. అల్లు అరవింద్ పీకల్లోతూ కోపంలో ఉన్నాడు అని..  కానీ లీగల్ యాక్షన్స్ తీసుకుంటారేమో..? రూల్స్ అడ్డు వస్తాయేమో..? అని టంగ్ కూడా స్లిప్ అవ్వకుండా చాలా కంట్రోల్ గా కళ్ళతోనే ఆన్సర్ ఇచ్చారు . అల్లు అరవింద్ ప్రవర్తించిన తీరు అందరికీ ఇప్పుడు షాకింగ్ గా ఉంది . సాధారణంగా అల్లు అరవింద్ ముఖాన్నే మాట్లాడేస్తాడు . ఏ విషయాన్ని దాచుకోడు . అలాంటి అల్లు అరవింద్ ని ఇలాంటి సిచువేషన్ లో పెట్టేసాడు రేవంత్ రెడ్డి అంటూ ఫన్నీగా మీమ్‌స్ తో కూడా ట్రోల్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: