వామ్మో.. ఏంటి ఇది రేవంత్ రెడ్డి మళ్ళీ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయించబోతున్నాడా..? నిజంగా ఇది నిజమేనా..? అలా అయితే బన్నీ కెరియర్ ఏంటి? బన్నీ నెక్స్ట్ కమిట్ అయినా సినిమాలో పరిస్థితి ఏంటి..? అంటూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు జనాలు . అల్లు అర్జున్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే.  రేవంత్ రెడ్డి కావాలని ఇలా చేశారు అంటూ బన్నీ అభిమానులు మండిపడుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి వర్షెన్ మాత్రం వేరేలా ఉంది .


బన్నీతో నాకు ఎటువంటి శత్రుత్వం లేదు అని.. ఒక నిండు ప్రాణం బలై పోతే చాలా సైలెంట్ గా ఉన్న సినీ ప్రముఖులు అల్లు అర్జున్ అరెస్ట్ అయి వస్తే మాత్రమే ఇంటికి వెళ్లి పరామర్శించారు అని .. ఆయనకు కాలు విరిగిందా..? చెయ్యి విరిగిందా..? పరామర్శించడానికి అసలు అక్కడ ఏముంది..? అంటూ అసెంబ్లీలోనే మాట్లాడటం సంచలనంగా మారింది. అయితే రేవంత్ రెడ్డి మాటలను చాలామంది పాజిటివ్ గానే తీసుకున్నారు.  రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంతో తప్పేముంది..? అసలు అల్లు అర్జున్ ని పరామర్శించడానికి అక్కడ ఏం జరిగింది..? అంటూ నాన్న విధాలుగా అల్లు అర్జున్ ని ట్రోల్ చేస్తున్నారు .



అయితే అసెంబ్లీలో అల్లు అర్జున్ పేరు ప్రస్తావించి రేవంత్ రెడ్డి భారీ హింట్ ఇచ్చాడు అని అల్లు అర్జున్ మళ్ళీ అరెస్టు కాబోతున్నాడు అన్న న్యూస్ ఇప్పుడు బాగా వైరల్ గా మారింది . అల్లు అర్జున్ కి హైకోర్టు బెయిల్ ఇచ్చింది . అయినా సరే అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేసే విధంగా రేవంత్ రెడ్డి తెలంగాణ పోలీసులు హయ్యర్ అఫీషియల్ తో మాట్లాడుతూ ఆయనను మళ్ళీ అరెస్టు చేయబోతున్నారు అంటూ న్యూస్ బయటకు వచ్చింది . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది. అయితే అల్లు అర్జున్ తన జాగ్రత్తల్లో తాను ఉన్నాడు అని .. ఒకవేళ పోలీసులు నిజంగానే అరెస్ట్ చేయడానికి వస్తే లీగల్ గా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు అంటూ కూడా బన్నీ అభిమానులు మాట్లాడుతున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు అల్లు అర్జున్ వ్శ్ రేవంత్ రెడ్డి ల మాటల వార్ హీట్ పెంచేస్తుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: