బ్రాహ్మణికి కూడా తన తండ్రి సినిమాలు అంటే చాలా ఇష్టమట. అందుకే తన సినిమాలను ఫస్ట్ డే చూడడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటుంది. అయితే తన తండ్రి తో పాటు మరొక హీరో కూడా ఇష్టమని తెలిపారు బాలయ్య.. అది ఎవరో కాదు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. ఈయన డాన్సులు, డైలాగులు అంటే తనకు చాలా ఇష్టమని బాలయ్య తెలిపారు. టాలీవుడ్ సీనియర్ హీరోలలో బాలకృష్ణ, చిరంజీవి మధ్య గట్టి పోటీ ఉండనే ఉంటుంది. అలాంటిది ఇప్పుడు బ్రాహ్మాణికి చిరంజీవి సినిమాలంటే ఇష్టమని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
తన తండ్రి సినిమాల తర్వాత బ్రాహ్మణ ఎక్కువగా చిరంజీవి, రామ్ చరణ్ వంటి సినిమాలను చూస్తూ ఉంటుందట. ఇక బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ విషయానికి వస్తే డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో తన కుమారుడిని హీరోగా లాంచ్ చేయబోతున్నారు. ఇటీవలే సినిమా షూటింగ్ ని మొదలు పెట్టాలని గ్రాండ్ గా ఓపెనింగ్ చేయడానికి ప్లాన్ చేసినప్పుడు.. మోక్షజ్ఞ ఆరోగ్యం సరిగ్గ లేకపోవడంతో మోక్షజ్ఞ వెనకడుగు వేశారట.. మరి వచ్చే ఏడాదైనా సినిమా షూటింగ్ మొదలు పెడతారేమో చూడాలి.. బాలకృష్ణ ప్రస్తుతం డాకు మహారాజ్ అనే చిత్రంలో నటించారు ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కి సిద్ధమయ్యింది.