తెలుగు సినిమా కామెడీ అనగానే మనకు గుర్తొచ్చే కొద్దిమంది లెజెండ్స్‌లో ఎం.ఎస్. నారాయణ ఒకరు. బ్రహ్మానందం సరసన నిలబడి పోటీ ఇవ్వగల కామెడీ టైమింగ్ ఆయన సొంతం. పంచ్ డైలాగులతో థియేటర్లలో నవ్వులు పూయించగల సత్తా ఉన్న నటుడు. ఆయన కామెడీ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెరపై ఆయన కనిపిస్తే చాలు, నవ్వులు గ్యారెంటీ. అంత సహజంగా, అలవోకగా నటించే ఆయన టాలెంట్‌కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఎం.ఎస్. నారాయణ సినిమాల్లోకి రాకముందు ఆయన లెక్చరర్‌గా పనిచేసేవారు. చదువు చెప్పే ఆయనకు నటనపై ఆసక్తి ఉండటంతో నాటకాలకు స్క్రిప్టులు రాసేవారు. ఆ తర్వాత రైటర్‌గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 1994లో మోహన్ బాబు హీరోగా వచ్చిన 'ఎం ధర్మరాజు ఎం.ఎ.' సినిమాతో నటుడిగా మారారు. ఈ సినిమాలో ఆయన నటనకు మంచి రెస్పాన్స్ రావడంతో ఆయన దశ తిరిగింది. మోహన్ బాబు కూడా ఆయన టాలెంట్ గుర్తించి ప్రోత్సహించడంతో ఎం.ఎస్. నారాయణ వెనుదిరిగి చూసుకోలేదు. అలా లెక్చరర్ నుంచి ఒక లెజెండరీ కమెడియన్‌గా ఎదిగారు.

తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎం.ఎస్. నారాయణ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. 'పుణ్యభూమి నాదేశం', 'పెద్ద రాయుడు' లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో ఆయన నటన అద్భుతం. ముఖ్యంగా 'పెద్ద రాయుడు' సినిమాలో ఆయన పోషించిన పాత్ర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. 1998 వచ్చేసరికి ఆయన ఏకంగా 13 సినిమాల్లో కమెడియన్‌గా నటించారంటే ఆయన ఎంత బిజీగా ఉండేవారో అర్థం చేసుకోవచ్చు. ఇక 1999లో అయితే ఆ సంఖ్య డబుల్ అయి ఏకంగా 23కి చేరిందంటే ఈ కమెడియన్ క్రేజ్ ఏ స్థాయిలో ఉండేదో ఊహించుకోవచ్చు. ఆ రోజుల్లో బ్రహ్మానందం కూడా ఇంత బిజీ షెడ్యూల్ ఉండేది కాదు. తాగుబోతు పాత్రల్లో ఎమ్మెస్ నారాయణ కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. అందుకే ఆ పాత్రలతో ఆయనకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ పాత్రలు అతనికి ఒక ట్రేడ్‌మార్క్‌గా నిలిచాయి.

ఎం.ఎస్. నారాయణ తన కామెడీ టైమింగ్‌తో ఎంతోమందిని నవ్వించారు. కానీ ఆయన జీవితంలో విషాదం కూడా ఉంది. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే, 2015లో అనారోగ్యంతో ఆయన హఠాత్తుగా మరణించడం అందరినీ కలచివేసింది. చనిపోయిన తర్వాత కూడా ఆయన నటించిన దాదాపు 30 సినిమాలు విడుదల కావడం విశేషం. అయితే ఇక్కడే ఒక విషాదకరమైన విషయం దాగి ఉంది. ఎం.ఎస్. నారాయణ చనిపోయాక అతనికి రావాల్సిన డబ్బుల కోసం ఆయన కొడుకు విక్రమ్ నారాయణ తీవ్రంగా పోరాడాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఆయన పడిన కష్టానికి ఫలితంగా రావాల్సిన దాంట్లో 60% డబ్బును తిరిగి పొందగలిగాడు.

'కొడుకు' సినిమాలో నటించి నటుడిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న విక్రమ్ ప్రస్తుతం అవకాశాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. న్యాయవాదిగా బతుకు ఈడ్చుకొస్తున్నారు. లెజెండరీ కమెడియన్ కొడుకు అయినప్పటికీ, విక్రమ్‌కు సినిమా అవకాశాలు అంత సులభంగా రావడం లేదు. తండ్రిలాగే నటుడిగా రాణించాలని ఉన్నా సరైన అవకాశాలు లేకపోవడంతో ఆయన చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఎం.ఎస్. నారాయణ అభిమానులు విక్రమ్ కష్టాలు చూసి చాలా బాధపడుతున్నారు. ఒక గొప్ప నటుడి కొడుకు ఇలా కష్టాలు పడటం నిజంగా బాధాకరమైన విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి: