ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల విషయంలో స్టార్ హీరోలు తమ డబ్బింగ్ తామే చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోని అన్ని భాషలు నేర్చుకోవడానికి ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు మహేష్ బాబు కూడా కన్నడ భాష నేర్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తుంది. రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న మహేష్ సినిమా కోసం కన్నడ నేర్చుకుని తానే డబ్బింగ్ చెప్పాలని కూడా ప్రయత్నం చేస్తున్నట్టు టాక్. రెండు భాగలుగా రానున్న ఈ సినిమాను ముందుగా వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా షూటింగ్ను మొదలు పెట్టబోతున్నారు .. తర్వాత వీలును బట్టి రాజమౌళి సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారు .. అయితే ఈ సినిమా విషయంలో మహేష్ బాబు కాస్త సీరియస్ గా ఉండటంతో సినిమా త్వరగానే రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి ..
ఇదే క్రమంలో మహేష్ అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పడానికి కూడా కష్టాలు పడుతున్నాడు. తమిళం కూడా పర్ఫెక్ట్ గా నేర్చుకోవడానికి రెడీ అవుతున్నాడు .. అలాగే మలయాళం నేర్చుకోవడంలో టైం పట్టే అవకాశం ఉండడంతో తమిళం , కన్నడ అలాగే హిందీ కూడా డబ్బింగ్ తానే చెప్పాలని ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించిన స్పెషల్ క్లాసులు కూడా ఒక సీనియర్ కన్నడ నటుడితో తీసుకుంటున్నారని తెలుస్తుంది. దేవరాజ్‌నే ఓ సీనియర్ నటుడు అటు కన్నడలోను ఫేమస్ ఇటు తెలుగులో కూడా ఆయన కొన్ని సినిమాలు చేశారు. ఇప్పుడు ఆయన దగ్గర మహేష్ బాబు కన్నడ నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారట .. రాజమౌళి కూడా ఈ విషయంలో ఆయనకు సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.