గత కొన్నేళ్లుగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు.. అయితే ప్రస్తుతం అందరి ఆశలు రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా మీదే ఉన్నాయి. ఈ సినిమా పైన భారీ హైప్స్ అయితే ఏర్పడ్డాయి. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ చిత్రాన్ని దింపబోతున్నారు నిర్మాత దిల్ రాజు.. తాజాగా అమెరికాలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా చాలా గ్రాండ్ గా నిర్వహించారు. అయితే ఇక్కడికి సుకుమార్, శంకర్ నిర్మాత దిల్ రాజు తో పాటు రామ్ చరణ్ వంటి వారు కూడా హాజరయ్యారు అయితే ఈ సినిమా గురించి ప్రముఖ దర్శకుడు సుకుమార్ కూడా పలు విషయాలు తెలియజేశారు.


ముఖ్యంగా తాము ఇప్పటికే ఈ సినిమాను చూసామని. అది కూడా చిరంజీవి గారితో చూడడం చాలా ఆనందంగా ఉందని.. మొదటి ఆఫ్ చాలా అద్భుతంగా ఉందని ఇంటర్వెల్ సీన్స్ అయితే బ్లాస్ట్ అయ్యేలా ఉంటాయని.. ఫ్లాష్ బ్యాక్ చూస్తున్నప్పుడు అందరికీ కూడా ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయని వెల్లడించారు సుకుమార్. ఇక క్లైమాక్స్లో రామ్ చరణ్ నటన చూసి అందరూ ఆశ్చర్యపోతారు.. రామ్ చరణ్ నటనకి అవార్డు వచ్చినా కూడా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదంటూ తెలిపారు సుకుమార్. సుకుమార్ చెప్పిన ఈ వ్యాఖ్యలకు రాంచరణ్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. దిల్ రాజు కూడా ప్రస్తుతం రాజకీయాల్లో జరుగుతున్న అన్ని విషయాలను ఏ సినిమాలో చూస్తారంటూ తెలిపారు.

గేమ్ ఛేంజర్ సినిమా కోసం మరింత ఎక్సైటింగ్ గా అభిమానులు ఎదురుచూస్తున్నామంటు తెలుపుతున్నారు.. జనవరి 10వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో కూడా నటిస్తూ ఉన్నారు.. కీయారా అద్వానీ , సునీల్, అంజలి, శ్రీకాంత్, ఎస్ జె సూర్య వంటి వారు కీలకమైన పాత్రలో నశిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: