టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాల తో దూసుకుపోతున్నారు.ఇదిలావుండగా విశ్వంభర సినిమా ఓ కొలిక్కి రావడంతో సీనియర్ హీరో చిరంజీవి మరికొన్ని ప్రాజెక్ట్స్ ను అనౌన్స్ చేయడానికి రెడీ అయ్యారు. ఇటీవలే హీరో నాని సమర్పణ లో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో ఓ చిత్రాన్ని ప్రకటించారు. ఇదే క్రమంలో డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమా కమిట్ అయినట్లు తెలుస్తోంది. కొత్త ఏడాది ప్రారంభంలో ఈ మూవీ ప్రకటన రావొచ్చని అంటున్నారు. మెగాస్టార్ ఇలా బ్యాక్ టూ బ్యాక్ అనౌన్స్ మెంట్స్ తో వస్తుండటంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే, శ్రీకాంత్ తర్వాత అనిల్ రావిపూడితో చేస్తారని అనుకుంటుండగా.. ఇప్పుడు కొత్తగా డైరెక్టర్ బాబీ తో చిరంజీవి మరో ప్రాజెక్ట్ కమిట్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైతే ఒక్క సినిమానే అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. దీని తర్వాత మెగాస్టార్ నుంచి ఏయే సినిమాలకు ప్రకటనలు వస్తాయి? బోయపాటి సినిమా ఎప్పుడు వుంటుంది? అనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలావుండగా  వీరి తరువాత చిరంజీవి తమిళ దర్శకుడు మిత్రంతో సినిమా చేసే అవకాశం ఉందని సమాచారం. మిత్ర ఎవరో కాదు అతను కార్తీతో సర్దార్ సినిమాను తీశారు. మిత్రం చెప్పిన స్టోరీ చిరంజీవికి నచ్చిందని ఆ కథను డెవలప్ చేయమని చిరంజీవి మిత్రురంతో చెప్పినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఒకవేళ చిరంజీవి నిజంగానే మిత్రన్‌కు ఈ అవకాశం ఇస్తే, త్వరలోనే మరో సినిమాతో ఆయన మన ముందుకు రావడం ఖాయమని చెప్పాలి. మరి మిత్రన్‌కు మెగా ఛాన్స్ దొరికేనా లేదా అనేది చూడాలి.ఇదిలావుండగా దీని తర్వాత మెగాస్టార్ నుంచి ఏయే సినిమాలకు ప్రకటనలు వస్తాయి? బోయపాటి సినిమా ఎప్పుడు వుంటుంది? అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: