గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో 'RC 16' మూవీ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ కంప్లీట్ చేసిన 'గేమ్ చేంజర్' రిలీజ్ సందడి ఇప్పుడు నడుస్తోంది. 2025 సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఫస్ట్ ప్రీరిలీజ్ ఈవెంట్ డల్లాస్ లో నిర్వహించారు.ఏ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా సుకుమార్ హాజరయ్యారు.ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, 'దిల్' రాజు ప్రొడక్షన్ సంస్థలపై అగ్ర నిర్మాత 'దిల్' రాజు, శిరీష్ రాజీ పడకుండా నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానున్న సంగతి తెలిసిందే.ఇదిలావుండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అమెరికాలోని తెలుగు వారిని పాల్గొనమని ఆహ్వానిస్తూ గురువారం చెర్రీ ఒక వీడియో సందేశాన్ని కూడా పంచుకున్నారు. ఈ క్రమంలో ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ స్పెషల్ ఎంట్రీ అదిరిపోయింది. ఆయన ఓ కింగ్ మాదిరి ఎంట్రీ ఇచ్చాడని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.ఇకపోతే ఇప్పటివరకు ప్రమోషన్స్ విషయంలో కానీ షూటింగ్ విషయంలో కానీ నత్త నడకన సాగిన ఈ సినిమా ఇప్పుడు ప్రమోషన్స్ విషయంలో మాత్రం వేగం పుంజుకోబోతోంది. అమెరికాలో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఆగిపోకుండా జనవరి 4వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ లో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  ముఖ్యఅతిథిగా మరో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. దీనికోసం దిల్ రాజు కూడా ఇప్పటికే పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మరొకవైపు మెగా అభిమానులు ఇండియన్ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: