సినీ ప్రేక్షకులకు వినోదం కావాలి అంటే ఎక్కువగా ఫ్యామిలీతో కలిసి థియేటర్లకు వెళుతూ ఉంటారు. అయితే ఈమధ్య ఓటీటీలు , మూవీ లింక్స్ వచ్చినప్పటి నుంచి థియేటర్ కి వెళ్లడం చాలా తక్కువగానే జరుగుతోంది. అంతేకాకుండా అధిక ధర టికెట్లు లోపల పాప్ కార్న్ వంటివి భారీ ధరలు ఉండడంతో చాలామంది వెళ్లడానికి మక్కువ చూపడం లేదు.కానీ ఇండియా మొత్తంలో కూడా ఎక్కువగా సినిమాలు చూసే ప్రజలలో అందరి నోట వినిపించే మాట రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలని కూడా చెప్పవచ్చు.. స్టోరీ పరంగా బాగుంటే చాలు భాషతో సంబంధం లేకుండా సినిమాలను సక్సెస్ చేస్తూ ఉంటారు. అలా ఇప్పటికే ఎన్నో సినిమాలకు పట్టం కట్టారు.


ఇక థియేటర్లో సినిమా చూడడం అనేది కూడా చాలామందికి ఇష్టంగా ఉంటుంది. మరి కొంతమందికి ఒక ఎమోషన్ తమ అభిమాన హీరోల సినిమాలు విడుదలయితే సాలు మొదటి రోజు థియేటర్ల వద్ద అభిమానులు చేసే హంగామా గురించి చెప్పాల్సిన పనిలేదు.. అయితే ఈమధ్య జరిగిన ఒక సర్వే ప్రకారం తెలుగు ప్రజలకు సినిమా పట్ల అభిమానం అనేది ఏ విధంగా ఉందో నిరూపించినట్లు సమాచారం.. ముఖ్యంగా ఇండియాలో ఉన్న సినిమా థియేటర్లలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నదట.


భారతదేశంలో మొత్తం మీద 6877 థియేటర్లో ఉండగా అందులో ఆంధ్రప్రదేశ్లో 1097 థియేటర్లు అత్యధికంగా ఉన్నాయని తెలిపారు. ఆ తర్వాత తమిళనాడులో 942, కర్ణాటక వంటి ప్రాంతంలో 719, మహారాష్ట్ర వంటి ప్రాంతంలో 703,తెలంగాణ రాష్ట్రంలో కేవలం 485 , గుజరాత్లో 420, బెంగాల్ ప్రాంతంలో 373, Up లో 321, బీహార్లు 315.. MH లో 188.. రాజస్థాన్ ప్రాంతంలో 178.. ఒడిస్సా ప్రాంతంలో 141 థియేటర్లు కలిగి ఉన్నాయట. ఇక మిగిలిన ప్రాంతాలలో కేవలం వందలోపు థియేటర్లు ఉన్నాయని సర్వేలో తెలియజేశారు.. అయితే ఈ సర్వే ప్రకారం టాప్ 5 లో నాలుగు స్థానాలు దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: