పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పలు చిత్రాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం కూడా ఒకటి. ఇదిలావుండగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కెరియర్‏లో వన్ ఆఫ్ ది హిట్ మూవీ బుజ్జిగాడు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో యంగ్ రెబల్ స్టార్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో డార్లింగ్ క్రేజ్ మరింత పెరిగింది. అయితే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఇందులో త్రిష, సంజన కథానాయికలుగా నటించగా సునీల్, మోహన్ బాబు కీలకపాత్రలలో నటించారు.ఏ హీరోకి అయినా కెరీర్ లో హిట్స్ అండ్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా గర్వంగా చెప్పుకునే చిత్రాలు కొన్ని ఉంటాయి. ప్రభాస్ కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం వర్షం. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన చిత్రం బాహుబలి ఇలా ప్రభాస్ అనేక బ్లాక్ బస్టర్స్ లో నటించాడు.కానీ ఒక ఫ్లాప్ మూవీ గురించి కూడా ప్రభాస్ గర్వంగా చెప్పుకుంటాడు.

మూవీ ఇంకేదో కాదు బుజ్జిగాడు. కమర్షియల్ గా బుజ్జిగాడు అంత గొప్పగా ఆడలేదు. కానీ ఈ చిత్రంలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ క్రేజీగా ఉంటుంది. రజనీకాంత్ అభిమానిగా ప్రభాస్ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు.టిప్పర్ లారీ వచ్చి స్కూటర్ ని గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా లాంటి క్రేజీ డైలాగులు అప్పట్లో బాగా ఆకట్టుకున్నాయి. ఒక ఈవెంట్ లో ప్రభాస్ చెబుతూ తన కెరీర్ లో గర్వంగా చెప్పుకునే   చిత్రాల్లో బుజ్జిగాడు ఒకటి అని అన్నారు. ఆ మూవీ అంటే నాకు చాలా ఇష్టం అని పేర్కొన్నారు.ఇదిలావుండగా ప్రభాస్‌ ఫౌజీతో పాటు మరిన్ని సినిమాలు చేస్తున్నారు. త్వరలోనే రాజాసాబ్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇంకా స్పిరిట్, కల్కి 2898 ఏడీ సీక్వెల్, సలార్ 2 వంటి సినిమాలు కూడా చేయనున్నారు. అలానే కేజీయఫ్‌, కాంతార, సలార్‌ చిత్రాలను నిర్మించిన సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ కూడా ప్రభాస్తో మూడు చిత్రాలను లైన్లో పెట్టినట్లు రీసెంట్గానే అఫీషియల్గా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: